ఢిల్లీ లో కేంద్ర కాబినెట్ భేటీ కొన్ని గంటలపాటు జరిగిన కాబినెట్ మీటింగ్ లో కీలకమైన చాలా అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ముందు నుండి అనుకుంటున్నా విధంగానే కీలక బిల్లులుగా చెప్పుకుంటూ వచ్చిన జమిలీ ఎన్నికలు, మహిళా బిల్లు, బీసీ రిజర్వేషన్ బిల్లు, దేశం పేరును మార్చడం వంటి వాటికి కాబినెట్ ఆమోదం తెలిపినట్లుగా సమాచారం అందుతోంది. కానీ కెబినెట్ మీటింగ్ పూర్తి అయ్యి దాదాపుగా ఒక గంట అవుతున్నా ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం కూడా బయటకు రాకపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అని చెప్పాలి.
మాములుగా అయితే కాబినెట్ మీటింగ్ పూర్తి కాగానే మంత్రులు అందులో తీసుకున్న విషయాలను మీడియా కు వెల్లడిస్తారు. అయితే ఎందుకు వీరు బహిర్గతం చేయలేదన్నది మోదీ ప్లాన్ లో భాగమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.మరి ఈ బిల్లును మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. అక్కడ మాత్రం కొన్ని బిల్లుల విషయంలో మాత్రం తీవ్రంగా విమర్శలు వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి.