గ్రూప్-2 పరీక్ష వాయిదా కోరుతూ అభ్యర్థుల నిరసన..

Candidates protest demanding postponement of Group-2 exam..
Candidates protest demanding postponement of Group-2 exam..

టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. వందలాది మంది వివిధప్రాంతాల నుంచి తరలివచ్చిన అభ్యర్థులు కమిషన్‌ కార్యాలయం ముందు బైఠాయించారు.అభ్యర్థులకు ఎన్​ఎస్​యూఐ నేతలతో పాటు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం, కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్‌తో పాటు వివిధ సంఘాల నేతలు మద్దతు తెలిపారు. పలువురు అభ్యర్థులు టీఎస్పీఎస్సీ ఆఫీసు వద్దకు ర్యాలీగా వస్తుండగా ముందుగా పోలీసులు అడ్డుకున్నారు.
అనంతరం, పెద్దఎత్తున నాయకులు, యువతీయువకులు తరలివచ్చి…. కమిషన్‌ కార్యాలయం ముందు బైఠాయించారు. గ్రూప్‌-2 పరీక్షను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తుండటంతో ఆఫీసు పరిసర ప్రాంతాలు హోరెత్తుతున్నాయి. ప్లకార్డులు పట్టుకొని అభ్యర్థులు గ్రూప్-2 వాయిదా వేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమది వాయిదా అభ్యర్థనే కానీ ఆందోళన కాదని అన్నారు. టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌ 2 అభ్యర్థులకు కాంగ్రెస్‌ మద్దతు తెలిపింది. అభ్యర్థులతో పాటు కోదండరాం కూడా నిరసనలో బైఠాయించారు