దారుణం: కరోనా పోవాలని… పూజారి నరబలి.. ఆపై అరెస్ట్

ప్రపంచమంతా కరోనా వైరస్ తో యుద్ధం చేస్తుంటే.. మరికొంతమంది మూఢ నమ్మకాలలో మునిగిపోయి అందులోంచి బయటకు రాలేకపోతున్నారు. ఈ కరోనా మహహమ్మారిని నయం చేసే వ్యాక్సిన్ తయారీ కోసం సైంటిస్టులు, పరిశోధకులు రేయింబవళ్లు కష్టపడుతుంటే.. మూఢనమ్మకాలతో నాటు వైద్యంతో కరోనాను పారదోలతామంటూ ఇంకా భ్రమల్లోనే బ్రతుకుతుంది లోకం.

అయితే తాజాగా ఓ అర్చకుడు కరోనా వైరస్ పీడ పోవాలని నరబలి ఇచ్చిన ఘటన సర్వత్రా కలకలం రేపుతోంది. ఈ దారుణ సంఘటన ఒరిస్సా రాష్ట్రంలో వెలుగు చూసింది. కటక్ జిల్లా నర్సింగ్ పూర్ లో బ్రాహ్మణిదేవి ఆలయంలో నరబలి ఇచ్చారు. కరోనా నుంచి ప్రజలకు విముక్తి కలగాలని ఆలయ అర్చకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన తెలిసి ప్రజలు తీవ్ర భయల భ్రాంతులకు గురయ్యారు. మొత్తానికి అది అంతా అందరికీ గుప్పుమనండంతో అర్చకుడు సంసారి హోజాను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.

కాగా బంధ్ మా బుధ్ బ్రహ్మణి ఆలయం పరిసర ప్రాంతాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆలయ పరిసర ప్రాంతంలోనే పూజారి నరబలి ఇచ్చాడని తెలియడంతో పోలీసులు పూజారిని అరెస్ట్ చేశారు. అయితే ఇంకా ఎవరిని నరబలి ఇచ్చారు అనేవిషయం ఇంకా తెలియడం లేదు. అయితే కరోనా వచ్చిన మొదట్లో మూఢనమ్మకాలు, గ్రామాల ప్రజలు పూజలు చేసి మొక్కులు చెల్లించడం, గుండు కొట్టించుకుంటే కరోనా రాదని గుడ్డిగా గుండు కూడా గీయించుకుంటున్న ఘటనలు చోటుచేసుకున్న వషయం తెలిసిందే.