టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేయాలంటూ కోర్ట్‌లో పిటీషన్

టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేయాలంటూ కోర్ట్‌లో పిటీషన్

ఏపీ రాజధాని అమరావతిలో ఇటీవలే నూతనంగా టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించింది. మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో మూడు అంతస్థులతో నిర్మించిన ఈ భవనాన్ని ప్రారంభం చేసి ఒక్క రోజు కూడా కాకుండానే దానిని కూల్చేయాలంటూ కోర్ట్‌లో పిటీషన్ దాఖలయ్యింది. వివాదస్పద భూమిలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించారని దానిని వెంటనే తొలగించాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కోర్ట్‌లో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే దీనిపై విచారణ చేపట్టిన హైకోర్ట్ టీడీపీకి, ప్రభుత్వానికి, కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే నాలుగు ఎకరాలున్న ఈ భూమిని 2017లో అప్పటి ప్రభుత్వం టీడీపీకి తొంభై తొమ్మిదేళ్ల లీజుకిస్తూ జీవో జారీ చేసింది. అయితే ఈ కేసు పిటీషన్‌లో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి సీసీఎల్ఏ కార్యదర్శి, ఏపీసీఆర్డీఏ కమీషనర్, జిల్లా కలెక్టర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆర్కే ప్రతివాదులుగా చేర్చారు. ఈ వివాద స్థలంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నదే ఇప్పుడు పెద్ద చర్చానీయాంశంగా మారింది.