బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(34) ఆత్మహత్యపై బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, ఎక్తాకపూర్లపై బీహార్ ముజఫర్ కోర్టులో బుధవారం కేసు నమోదైంది. సుశాంత్ ఆకస్మిక మరణం సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో అతడి ఆత్మహత్యకు బాలీవుడ్‌లోని కొంతమంది ప్రముఖులే కారణమంటూ న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా ముజఫర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపాడు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ… సుశాంత్ ఆత్మహత్యపై నిర్మాత కరణ్ జోహార్, సంజయ్ లిలా భన్సాలీ, ఎక్తాకపూర్, సల్మాన్ ఖాన్‌తో పాటు మరో 8 మందిపై బీహార్ ముజఫర్ కోర్టులో ఐపీసీ సెక్షన్ 306, 109, 504, 506 కింద పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపాడు.
సుశాంత్‌ను 7 చిత్రాల నుంచి తొలగించారని, అంతేగాక అతడు నటించిన కొన్ని సినిమాలు విడుదల చేయలేదని. అందవల్లే సుశావంత్ ఒత్తిడికి గురై సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన పిటిషన్లో పేర్కొన్నాడు. సలో తాను పేర్కొన్నట్లు చెప్పాడు. ఇక వీరిని ఐసీసీ సెక్షన్ 306(ఆత్మహత్యకు పాల్పడటం), సెక్షన్ 109(ఒక చర్య పాల్పడితే దానిపై వివరణ ఇవ్వకపోతే, నిబంధనలు చేయకపోతే శిక్ష విధించపడుతుంది), 504,506 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టును కోరినట్లు కూడా చెప్పాడు. కాగా సుశాంత్ ఆదివారం(జూన్ 14)న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో సుశాంత్ బాధపడుతున్నాడని, దీనికి అతడు చికిత్స కూడా తీసుకుంటున్నట్లు ముంబై పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు.