నారా లోకేష్‌పై కేసు నమోదు

నారా లోకేష్‌పై కేసు నమోదు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై కేసు నమోదైంది. ఆయనపై విజయవాడ కృష్ణలంక పీఎస్‌లో సెక్షన్ 341,186,269 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, ట్రాఫిక్ అంతరాయం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని లోకేష్‌పై కేసులు నమోదయ్యాయి.

తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితపై కూడా కేసు నమోదు చేశారు.నారా లోకేష్‌పై గన్నవరం విమానాశ్రయం నుంచి నరసరావుపేట వెళ్తుండగా పర్యటనకు అనుమతి లేదని లోకేష్‌ను పోలీసులు అడ్డుకోవడంతో నిన్న విజయవాడలో నాలుగు గంటల పాటు హైడ్రామా నెలకొన్న విషయం తెలిసిందే.

విమానాశ్రయం ప్రాంతంలో 144 సెక్షన్‌ అమలులో ఉన్న కారణంగా లోకేశ్‌ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తల్ని అరెస్ట్‌ చేశారు. ముందస్తుగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ట్రాఫిక్‌కు అంతరాయం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.