బ్రాండ్‌ బాబు ఆ జర్నలిస్ట్‌ను చంపేశాడు.. కేసు నమోదు!!

Case filed by a journalist on brand babu unit

తెలుగు ప్రేక్షకుల్లో మారుతి సినిమా అంటే మంచి క్రేజ్‌ ఉంది. ఆయన దర్శకత్వంలో రాకున్నా కూడా ఆయన బ్రాండ్‌తో సినిమా వస్తుంది అంటూ సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు ఉంటాయి. ఇక ఆయన కథ, స్క్రీన్‌ప్లే అందించిన సినిమా అవ్వడంతో బ్రాండ్‌బాబు సినిమాపై అందరిలో ఆయన సొంత సినిమా అన్నట్లుగానే అంచనాలు పెరిగాయి. తాజాగా విడుదలైన బ్రాండ్‌ బాబు అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. ప్లాప్‌ అయిన సినిమాల గురించి పెద్దగా వివాదాలు రావు. సక్సెస్‌ అయితేనే తమ గురించి తప్పుగా చూపించారు అంటూ కొందరు ముందుకు వస్తారు. కాని తాజాగా బ్రాండ్‌బాబుపై ఒక మహిళ జర్నలిస్ట్‌ మీడియా ముందుకు వచ్చింది. ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.

brand babu unit

ఇంతకు ఏం జరిగింది అంటే… ఈ చిత్రంలో ఒక సీన్‌లో ఒక మహిళ చనిపోయినట్లుగా చూపించారు. ఆ మహిళ ఫొటోతో సీన్‌ ఉంది. ఆ ఫొటోలో ఉన్న మహిళ ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు తనకు తెలియకుండా తన ఫొటోను వాడటంతో పాటు, చనిపోయినట్లుగా చూపించారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సినిమాలో తన ఫొటోను చనిపోయినట్లుగా చూపించడంతో తన కుటుంబ సభ్యులు తీవ్ర మనస్థాపంకు గురైనట్లుగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు త్వరలోనే ఎంక్వౌరీ చేసేందుకు సిద్దం అవుతున్నారు. అయితే ఈ వివాదాన్ని మాట్లాడుకుని సెటిల్‌ చేసుకుంటే బాగుంటుందని కొందరు బ్రాండ్‌ బాబు నిర్మాతలకు సలహా ఇస్తున్నారు. ఈ వివాదం ఎక్కడకు వెళ్తుందో చూడాలి.