ఎన్టీఆర్‌ కోసం ఈ ముగ్గురు కన్ఫర్మ్‌

Rana sumanth and rakul preet confirmed for NTR Biopic

ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందబోతున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ ఇటీవలే పూర్తి అయ్యింది. తాజాగా రెండవ షెడ్యూల్‌ను కృష్ణా జిల్లాలో ప్రారంభించారు. ఈ రెండవ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు క్రిష్‌ ఏర్పాట్లు చేశాడు. ఇక ఈ చిత్రంలో ఏయన్నార్‌ పాత్రను నాగచైతన్య లేదా సుమంత్‌ చేయబోతున్నారని, చంద్రబాబు నాయుడు పాత్రను రానా చేయనున్నాడు, ఒక కీలక పాత్రలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. తాజాగా ఆ విషయంపై అధికారికంగా క్లారిటీ వచ్చేంది.

Rana sumanth and rakul preet confirmed for NTR Biopic

తాజాగా చంద్రబాబు నాయుడును బాలకృష్ణ మరియు క్రిష్‌తో కలిసి రానా కలిసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత తాను ఎన్టీఆర్‌ చిత్రంలో నటిస్తున్నట్లుగా ప్రకటించాడు. ఇక రానా ట్వీట్‌కు రీ ట్వీట్‌గా సుమంత్‌ తాను కూడా ఎన్టీఆర్‌ చిత్రంలో నటించబోతున్నట్లుగా ప్రకటించాడు. వీరిద్దరితో పాటు జయలలిత పాత్రలో ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించబోతున్నట్లుగా కూడా క్లారిటీ వచ్చేసింది. ఇక సావిత్రి పాత్రకు మొదటి నుండి కూడా కీర్తి సురేష్‌ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. త్వరలోనే ఆ విషయంపై కూడా క్లారిటీ రాబోతుంది. ఈ చిత్రం నిండా కూడా ఫుల్‌ స్టార్‌ కాస్ట్‌ నిండి ఉండటం ఖాయంగా అనిపిస్తుంది. బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ కనిపించబోతున్న విషయం తెల్సిందే. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రంను భారీ ఎత్తున విడుదల చేసేందుకు క్రిష్‌ మరియు బాలయ్యలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Rana sumanth and rakul preet confirmed for NTR Biopic