విడదల రజిని ఇటీవల హైస్కూల్ విషయంలో జోక్యం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆ విషయంలో హెచ్ ఎం ధనలక్ష్మిని కమిటీని రద్దు చేయాలనీ చెప్పడం తో వివాదం మొదలయ్యింది. అయితే ధనలక్ష్మి రజిని మాట్లాడిన ఫోన్ కాల్ ని, అందులోని మాటలను కమిటీ సబ్యులకు వినిపించడం తో రజిని ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యా శాఖ అధికారులు ధనలక్ష్మి ఫై సస్పెన్షన్ వేటు పడేలా చేయడం తో ధనలక్ష్మి హైకోర్టు ని ఆశ్రయించడం జరిగింది.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎమ్మెల్యే రజిని ఫిర్యాదు కీలకం కాగా, ఆమె ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు అక్టోబర్ లో ధనలక్ష్మిని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే సస్పెండ్ ని సవాల్ చేస్తూ హైకోర్టు ని ఆశ్రయించిన ధనలక్ష్మి దీని ఫై విచారణ జరిపేలా చర్యలు తీసుకున్నారు. విచారణ జరిపిన కోర్ట్ ధనలక్ష్మి ఫై ఉన్న సస్పెండ్ ఉత్తర్వులను ఎత్తి వేయడం జరిగింది. అయితే ఈ విషయంలో చిలకలూరి పేట ఎమ్మెల్యే రజిని కు షాక్ తగిలిందని చెప్పాలి. సస్పెన్షన్ ఎత్తివేయడంతో ధనలక్ష్మికి ఊరట లభించింది.