బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిలకు ఊహించని షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. కోకాపేటలోని సర్వే నంబర్ 85లో ఓ భూమి వివాదంలో ఉంది.
ఈ భూమికి సంబంధించి ఇన్వెస్టర్ల ,డెవలపర్లు మధ్య వివాదం నడుస్తుండగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, వారి అనుచరులు అక్కడ గుడిసెల్లో నివాసం ఉంటున్న కూలీలను తరిమికొట్టి భూమిని ఆక్రమించారు. దీంతో డెవలపర్లు పోలీసులను ఆశ్రయించారు.