ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా విజయవాడ వాసికి కరోనా పాజిటీవ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రం మొత్తంలో కేసుల సంఖ్య 11కు చేరింది. ఈ సమయంలో ఏపీ డీజీపీ మాట్లాడుతూ… ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి ఎవరూ రావద్దని స్పష్టం చేశారు. అలాగే.. వార్షిక పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం ఆరు నుంచి తొమ్మిదివ తరగతి వరకు విద్యార్థులందరినీ పాస్ చేస్తూ.. ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీలో కరోనా వైరస్ కు సంబంధించిన పాజిటివ్ కేసులైతే ఒక్కొక్కటిగా పెరుగుతున్నాయి. నిన్నటికీ 11 పాజిటివ్ కేసులు వచ్చినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. అయితే ఈ 11కేసుల్లో మూడు కేసులు విజయవాడలో నమోదైనట్టుగా ప్రభుత్వం గుర్తించింది.
అదేవిధంగా ఇలాంటి సమయంలో ప్రజలకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేస్తుంది ప్రభుత్వం. నిత్యావసర వస్తువులకుబ ఇబ్బందికలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తుంది. మొత్తం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కూడా వినియోగదారులందరూ నిత్యావసర వస్తువులు కొనుగోళ్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆన్ లైన్ లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయటానికి సంబంధించి 12 సూపర్ బజార్లు ముందుకు వచ్చాయి. వాళ్లకి ఫోన్లో ఆర్డరిస్తే ఇంటికే డోర్ డెలివరీ చేస్తామని చెప్పాయి. ఇలా ఒక వైపున ఆన్ లైన్ లో డోర్ డెలివరీ.. మరోవైపు వినియోగదారులు నేరుగా మార్కెట్ వద్దకు వెళ్లి కొనుగోలు చేయడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదని స్పష్టమౌతుంది.