విశాఖ విమానాశ్రయం జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి ఘటనపై ఏపీ పోలీసుల విచారణపై తమకు ఎలాంటి నమ్మకం లేదని వైసీపీ నేతలు ప్రకటిస్తున్నారు. అందుకే వారు హైకోర్టులో ఓ పిటిషన్ కూడా వేశారు. దాని సారాంశం ఏమిటంటే ఏపీ పోలీసులు కాకుండా ఈ విచారణ కేంద్ర ప్రభుత్వ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థతో విచారణ చేయాలని. అయితే అలా కేంద్ర ప్రభుత్వ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ సీబీఐ ఒక్కటే. అయితే వారం రోజులుగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌పై వైసీపీతో పాటు జగన్ మీడియా వైఖరి చూస్తే మాత్రం ఆశ్చర్యపోక తప్పదు.
ఎందుకంటే సీబీఐలో జరుగుతున్న పరిణామాలన్నింటికీ టీడీపీ నేతలు, చంద్రబాబే మూలకారణం అని సాక్షి పత్రిక బ్యానర్ కథనాలు ప్రచురిస్తోంది. ఓ రోజు చంద్రబాబు అండ్ కో పెట్టిన చిచ్చు వల్లే టాప్ టూ అధికారులు ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు అని సీబీఐలో చాలా మంది చంద్రబాబు మనుషులేనని సాక్షి పత్రిక రాసుకొచ్చింది. ఆ తర్వాతి రోజే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎమర్జెన్సీగా అర్థరాత్రి ఇద్దర్నీ తప్పించేసి తెలుగు వాడైన మన్నెం నాగేశ్వరరావును ఇంచార్జి సీబీఐ డైరక్టర్‌గా నియమించారు. దీంతో మళ్లీ గగ్గోలు ప్రారంభమయింది. ఆయన చంద్రబాబు మనిషి అని తీర్పు ఇచ్చేసి కథలు కథలుగా రాసుకొచ్చారు.
సీబీఐలో చంద్రబాబు పట్టు సాధించేశాడని మోడీని కూడా బోల్తా కొట్టిచారని కధనాలు వండి వడ్డించారు. ఇక సీబీఐ తరపున ఎలాంటి యాక్షన్ జరిగినా దాన్ని చంద్రబాబుకు ముడి పెట్టేయడానికి కావాల్సినంత ముడిసరుకుని జగన్ మీడియా రెడీ చేసుకుంది. అలాంటి సందర్భంలో అనూహ్యంగా.. జగన్ పై జరిగిన దాడి ఘటనపై విచారణ కోసం మళ్లీ అదే సీబీఐ విచారణ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని వైసీపీ నేతలు ఊహించి ఉండరు. కానీ నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనుకుంటూ ఇప్పుడు మళ్ళీ సీబీఐ అంక్వైరీ అడుగుతున్నారు ఆ పార్టీ నేతలు.