ఈ పాటల రచయిత మళ్ళీ దొంగతనం చేస్తూ దొరికిపోయాడు…!

Tollywood-Lyric-Writer-Kula

కులశేఖర్ అనే పాటల రచయిత మీకు గుర్తున్నారా…? ఒకవేళ మీరు మెలోడీ పాటలకి చెవి కోసుకునే వాళ్లయితే మీకు ఖచ్చితంగా ఆ పేరుతో పరిచయం ఉండే ఉంటుంది. తెలుగు సినిమా దర్శకుడు తేజ తీసిన చిత్రం, నువ్వు నేను, జయం సినిమాలకు, వెంకటేష్ నటించిన సంతోషం, ఘర్షణ సినిమాలకు మధురమైన మెలోడీస్ అందించిన ఘనత ని సొంతం చేసుకున్నారు. ఇప్పటికి ఆయన రచించిన పాటలు ఎక్కడో ఒకచోట వినపడుతూనే ఉంటాయి అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. కాస్త పేరుతో పాటుగా, డబ్బు సంపాదించాక కులశేఖర్ డైరెక్టర్ గా తన ప్రతిభ చాటాలని ప్రేమలేఖ రాశా అనే సినిమాకి దర్శకత్వం వహించారు.

Kulasekhar-Arrested

అయితే, ఆ సినిమాలో రాసిన ఒక పాట పై బ్రాహ్మణ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమే కాక, ఏవో కారణాల వలన ఆ సినిమా విడుదల కూడా నిలిచిపోయింది. ఈ విషయం తో మానసిక సంఘర్షణకి గురైన కులశేఖర్ కొన్ని సవంత్సరాల పాటు ఇల్లు వదిలి బయటకి రాలేదు. ఇంతలో అతనికి మెదడుకి సంబంధించిన వ్యాధి సోకడం వలన, మతిస్థిమితం తప్పడంతో పూర్తిగా సినిమా ప్రపంచాన్ని విడిచిపెట్టారు. కానీ, బ్రాహ్మణులపై, గుడిలో అర్చకులపై తెలియని కోపం పెంచుకున్న ఈయన ఇక అప్పటినుండి ఆలయాల్లో దొంగతనం చేయడం మొదలు పెట్టారు. తాజాగా కులశేఖర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం ఆయన జూబ్లీహిల్స్ పరిధిలోని ఒక ఆలయ పూజారి సంచిని దొంగిలించారు.

Kulasekhar

ఆ తరువాత ఆయన శ్రీనగర్ కాలనీ లోని మరో ఆలయం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని, ఆయన నుండి నగదు మరియు కొన్ని విలువైన వస్తువులని స్వాధీనం చేసుకొని, అతన్ని రిమాండ్ కి తరలించారు. పోనీ సినిమావాళ్లు కులశేఖర్ కి ఏదైనా సహాయం చేయాలనుకున్నా , ఏమి చేయాలో, ఏ విధంగా చేయాలో తెలియని పరిస్థితిలలో స్పందించడం కూడా మానుకున్నారు. ఏదేమైనా తన రచనలతో శ్రావ్యమైన మెలోడీ పాటలను అందించిన కులశేఖర ఇప్పుడు ఇలా ఒక దొంగగా ముద్రపడి, దొంగతనాలు చేయడం నిజంగా జీర్ణించుకోలేని విషయం.