వర్మకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చిన సీసీఎస్‌ పోలీస్‌లు

CCS Police Sends Notice to ram gopal Varma about GST

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటాడు. కొన్ని సార్లు లేని వివాదంను స్వయంగా కల్పించుకునని మరీ వివాదంను పెట్టుకుంటాడు. ఇలా ఎన్నో సార్లు వర్మ వివాదాలతో స్నేహం చేశాడు. తాజాగా మరోసారి వర్మ జీఎస్టీ అనే షార్ట్‌ఫిల్మ్‌ను తెరకెక్కించి వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే. జీఎస్టీ సినిమా విడుదల సమయంలో సామాజిక కార్యకర్త దేవిపై రామ్‌ గోపాల్‌ వర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాను తెరకెక్కించిన సినిమాపై విమర్శలు చేసినందుకు దేవిపై ఒక మహిళ అని కూడా చూడకుండా వర్మ చేసిన విమర్శలు ఇప్పుడు ఆయన్ను చిక్కుల్లో పడేశాయి. 

రామ్‌ గోపాల్‌ వర్మ తనపై విమర్శలు చేశాడు అంటూ దేవి సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు వీడియో ఫుటేజ్‌లు మరియు పేపర్‌లో వచ్చిన వార్తల ఆధారంగా వర్మకు నోటీసులు ఇచ్చారు. కేసు విచారణకు నేడు సాయంత్రం ఆరుగంటల వరకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ముంబయిలో ఉన్న వర్మ సీసీఎస్‌ పోలీసుల నోటీసులను అందుకోలేదని, ఆయన ప్రస్తుతం షూటింగ్‌తో బిజీగా ఉన్న కారణంగా నేడు విచారణకు రాలేడు అంటూ వర్మ తరపు లాయర్‌ సీసీఎస్‌ పోలీసులకు తెలియజేయడం జరిగింది. మరోసారి వర్మకు నోటీసులు ఇవ్వాలని, ఆ నోటీసుల ప్రకారం విచారణకు హాజరు అవుతాడని లాయర్‌ పేర్కొన్నాడు. దాంతో వర్మకు మళ్లీ నోటీసులు ఇచ్చేందుకు సీసీఎస్‌ పోలీసులు సిద్దం అవుతున్నారు. ఈసారి విచారణకు హాజరు కాని పక్షంలో ఆయనపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసే అవకాశం ఉంది.

వర్మకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చిన సీసీఎస్‌ పోలీస్‌లు - Telugu Bullet