ఆసిఫా బానో దారుణంపై సెల‌బ్రిటీల ఆవేద‌న‌

celebrities tweets on Asifa Bano rape case

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

  • దేవుడు అన్నీ చూసుకుంటాడ‌ని ఇక‌పై కూడా అనుకుంటారా.???
    ఆసిఫా బానో దారుణంపై సెల‌బ్రిటీల ఆవేద‌న‌

ఎనిమిదేళ్ల చిన్నారి ఆసిఫా బానోపై సామూహిక హ‌త్యాచారం దేశ‌వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ప‌లు అంత‌ర్జాతీయ వార్తాప‌త్రిక‌లు సైతం ఈ క‌థ‌నాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌చురించాయి. సామాన్యుల నుంచీ సెల‌బ్రిటీల దాకా ప్ర‌తి ఒక్క‌రూ ఈ దారుణంపై సోష‌ల్ మీడియా వేదికగా ఆవేద‌న‌ను పంచుకుంటున్నారు. ఈ దారుణాన్ని ఖండిస్తూ ప‌లువురు ప్ర‌ముఖులు ట్వీట్లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌స్టిస్ ఫ‌ర్ ఆసిఫా అనే హ్యాష్ ట్యాగ్ పేరిట సోష‌ల్ మీడియాలో ఉద్యమం న‌డుస్తోంది. దేవుడు అన్నింటినీ, అంద‌రినీ చూసుకుంటాడు అని స‌మాజంలో బ‌లంగా పాతుకుపోయిన ఓ న‌మ్మ‌కంలోని హేతుబ‌ద్ధ‌త‌ను కూడా సెల‌బ్రిటీలు ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నిస్తున్నారు. దేవుడు అన్నీ చూసుకుంటాడు అని ఇక‌పై కూడా అనుకుంటారా…? మీరే జాగ్ర‌త్త‌గా ఉంటే మంచిది. ఆసిఫాను ఆల‌యంలో అత్యాచారం చేసి, హ‌త్య చేశారు. ఆ స‌మ‌యంలో మ‌నమో, ఆ దేవుడో చిన్నారికి స‌హాయం చేయ‌లేదు అని తీవ్ర ఆవేద‌న‌తో ట్వీట్ చేశారు.

nikki galramni about asif bano

దేవుడు లేడు… కేవ‌లం దెయ్యాలే ఉన్నాయి అనే హ్యాష్ ట్యాగ్ కూడా జ‌త‌చేశారు. టాలీవుడ్ హీరోయిన్ స‌మంత కూడా ఇదే ర‌క‌మైన అభిప్రాయం వ్య‌క్తంచేసింది. ఇలాంటి సంఘ‌ట‌న‌లు చూసిన‌ప్ప‌డు నిజంగా దేవుడు ఉన్నాడా..అని ఆశ్చ‌ర్యం క‌లుగుతుంద‌ని స‌మంత ట్వీట్ చేసింది. ప‌విత్ర‌మైన గుడిలో… మ‌హిళ‌ల్ని దేవ‌త‌లుగా చూసే ఈ దేశంలో…ఆ చిన్నారికి జరిగిన సంఘ‌ట‌న గురించి ఆలోచిస్తోంటే త‌న గుండె బ‌రువెక్కుతోంద‌ని నిక్కీ గ‌ల్రానీ ఆవేద‌న వ్య‌క్తంచేసింది. నిజంగా మాన‌వ‌త్వం అనేది ఇంకా ఉందా అని ప్ర‌శ్నించింది…ఆసిఫాకు న్యాయం జ‌ర‌గాల‌ని, ఆమెకు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేసింది. ఆమెను హింసించి, చంపిన ఈ మృగాల్ని హింసించేందుకు న‌ర‌కం ఎదురుచూస్తుంటుంద‌ని, ఆ నీచుల‌ని ఉరితీయాల‌ని, కాస్త కూడా మాన‌వ‌త్వం లేకుండా ఇలా ఎలా ప్ర‌వ‌ర్తిస్తార‌ని హ‌న్సిక ట్వీట్ చేసింది. ఈ సంఘ‌ట‌న తెలుసుకున్న త‌ర్వాత కూడా ర‌క్తం ఆగ్ర‌హంతో మ‌ర‌గ‌ట్లేదు అంటే అది ర‌క్తం కాద‌ని, నీర‌ని, దీన్ని ఓ వార్త‌లా భావించి ప‌క్క‌న‌పెట్ట‌కుండా దీనిపై గ‌ళం విప్పాల‌ని విశాల్ డాడ్లానీ తీవ్రంగా స్పందించారు.

hanika aabout ashif