ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని ఆర్థిక మంత్రి ప్రకటించిన బ్యాంకుల సంఖ్య తర్వాత 12కు దిగి రానున్నది. తొలిగా పీఎన్‌బీ బ్యాంక్ విలీనం కానుంది. ఆంధ్రా బ్యాంక్, సిండికేట్ బ్యాంకులు కూడా విలీనం కానున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకుల విలీనానికి సంబంధించి కీలక ప్రకటన చేసి ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్యను తగ్గిస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే.
అలహబాద్ బ్యాంక్‌తో ఇండియన్ బ్యాంక్‌ను విలీనం చేయడం వల్ల దీంతో ఏడవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ఆవిర్భవించనుంది. మొదటిగా విలీనం అయ్యే బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ యునైటెడ్ బ్యాంకులు కలిసి పోయాక ఈ బ్యాంకుల కార్యకలాపాలు పీఎన్‌బీ చూసుకోనుంది. ఐదవ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లు వీలినం అవడం వల్ల ఆవిర్భవించనుంది. నాలుగవ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంకులను వీలీనంతో ఏర్పడనుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో దీని ఐదు అనుబంధ బ్యాంకులను కేంద్రం విలీనం చేసింది. 2019 ఏప్రిల్1 నుండి బ్యాంకుల విలీనం అమలులోకి రాగ ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, దేనా బ్యాంక్ల విలీనానికి ఆమోదం తెలిపినది. కేంద్రం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ల విలీనానికి కూడా ఆమోదం తెలిపింది.