వీర్రాజు చెప్తే బాబు కదిలారు… ఇప్పుడు పోలవరాన్ని ఆపిందెవరు?

central-government--trying-

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తన కోడి లేస్తేనే తెల్లారుతుందని భావించే ముసలవ్వకు బీజేపీ నేత సోము వీర్రాజుకు పెద్ద తేడా లేదు. పోలవరం నిర్మాణం కోసం తెలంగాణ లోని ఏడు ముంపు మండలాలు ఏపీ లో కలపకపోతే ఇబ్బంది అవుతుందని సీఎం చంద్రబాబుకు ఎవరు చెప్పారో తెలుసా ? బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అట. ఈ విషయాన్ని ఆయనే మండలిలో చెప్పుకున్నారు. తాను చెప్పాకే ఆ విషయంలో సీరియస్ నెస్ గమనించిన చంద్రబాబు ఆ 7 మండలాలను ఏపీ లో కలపకపోతే సీఎం గా ప్రమాణస్వీకారం చేయనని చెప్పడంతో ఆ పని వెంటనే పూర్తి అయ్యిందని సోము చెప్పుకోవడమే కాదు బీజేపీ కి సరైన క్రెడిట్ రావడం లేదని బాధపడ్డారు. అంతేనా పత్రికల్లో ఏపీ అంశంలో మోడీ కి వ్యతిరేక కధనాలు వస్తుంటే ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. పత్రికల్లో వచ్చే దానికి ప్రభుత్వం ఏమి చేస్తుందన్న కనీస అవగాహన లేకుండా మాట్లాడిన సోము తాజాగా పోలవరానికి కేంద్రం కొర్రీ వేయడం గురించి మాత్రం ప్రస్తావించలేదు.

పోలవరం విషయంలో తాము చెబితే చంద్రబాబు ముందుకు కదిలారు అని చెబుతున్న వాళ్ళు ఇప్పుడు కాపర్ డాం , స్పిల్ వే, స్పిల్ చానెల్ పనులు ఆపాలని కేంద్రం లేఖ రాసింది ఎందుకో చెప్పలేకపోతున్నారు. రాజకీయాల కోసం కేంద్రం ఏపీ ప్రజల మొహాన మట్టి కొడుతున్నా పట్టించుకునే నాధుడే లేడు. జాతీయ హైడ్రో పవర్ కార్పొరేషన్ పరిశీలించేంత వరకు కాపర్ డ్యామ్ పనులు ఆపాలని కిందటి నెలలో కేంద్ర జలవనరుల శాఖ కొర్రీ పెట్టింది. ఇంత వరకు nhpc బృందం పోలవరం రాలేదు.

construction-works

ఇంతలో మరో షాక్. స్పిల్ వే , స్పిల్ చానెల్ పనుల కోసం పిలిచిన టెండర్లు కూడా ఆపాలని ఇంకో మూడు రోజుల్లో రిటైర్ కాబోతున్న కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జీత్ సింగ్ లేఖ రాశారు. 2019 ఎన్నికల లోపు పోలవరం పనులను ఓ కొలిక్కి తేవాలని చూస్తున్న చంద్రబాబుకు కేంద్రం అడుగడుగునా అడ్డం పడడం అందరికీ కనిపిస్తున్నా ఇంకా కొందరు బీజేపీ నేతలు మోడీ క్రెడిట్ గురించి మాట్లాడడం చూసి ఏపీ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మోడీ పదవి ఎక్కగలడమేమో గానీ ఆ ఎక్కడానికి అవసరమైన ఓట్లు వేసేది జనమే అని ఏపీ బీజేపీ నేతలు మరీ ముఖ్యంగా సోము లాంటి కొందరు మర్చిపోతున్నట్టు వున్నారు. త్వరలో ఇలాంటి వాళ్ళు పోలవరం మీద కేంద్రం చేసే పాపాలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.