కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు శనివారం కొత్త గవర్నర్లను నియమించింది. తాజాగా కొన్ని కీలక రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేయడంతో పాటు కొత్తవారిని గవర్నర్లుగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్లుగా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి వీరి నియామకం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్ నేత విశ్వభూషణ్ హరిచందన్‌ను ఏపీ గవర్నర్‌గా నియమిస్తూ గత మంగళవారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఏ రాష్ట్రానికి ఎవరంటే..!
ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్‌గా ఆనందీబెన్ పటేల్ నియామకం(మధ్యప్రదేశ్ నుంచి యూపీకి బదిలీ)
మధ్యప్రదేశ్ గవర్నర్‌గా లాల్జీ టాండన్ నియామకం(బిహార్ నుంచి మధ్యప్రదేశ్‌కు బదిలీ)
బిహార్ గవర్నర్‌గా ఫగు చౌహాన్ నియామకం
పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా జగ్దీప్ ధన్ఖర్ నియామకం
త్రిపుర గవర్నర్‌గా రమేశ్ బయాస్ నియామకం
నాగాలాండ్ గవర్నర్‌గా ఆర్ఎన్ రవి నియామకం