బిగ్ బాస్ ఫైనలిస్ట్స్ వీరే…ఇదే ఆధారం !

big boss 3 finalists

అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3 ఈ ఆదివారం రోజున ప్రారంభం కానున్న విషయం తెలిసిందే . జూలై 21 న బిగ్ బాస్ 3 ప్రారంభం కానున్నట్లు ఇంతకుముందే అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే ! అయితే బిగ్ బాస్ పై రకరకాల ఆరోణలు వస్తున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది .మరోవైపు బిగ్ బాస్ హౌజ్ తో పాటు నాగార్జున ఇంటిని ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చింది ఓయు . దాంతో గట్టి చర్యలు తీసుకున్నారు పోలీసులు . ఆ 15 మంది సెలబ్రిటీలు ఎవరంటే నటి హేమ, యాంకర్ శ్రీముఖి, తీన్మార్ సావిత్రి, నటి హిమజా రెడ్డి, నటుడు వరుణ్ సందేశ్-వితికా షెరు(జంట), సీరియల్ నటుడు రవికృష్ణ, సీరియల్ యాక్టర్ అలీ రెజా, టీవీ9 న్యూస్ యాంకర్ జాఫర్, నటి పునర్వీ భూపాలం, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యూట్యూబ్ కామెడీ స్టార్ మహేశ్, సీరియల్ నటి రోహిణి, డబ్‌స్మాష్ స్టార్ అశు రెడ్డి(సమంతా డూప్) ఉన్నారు.