నా ఓటు యాప్ కి లోగో డిజైన్ చేస్తే 15 వేల బహుమతి…!

CEO Launches Naa Vote To Help Electors

రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ ‘నా ఓటు’ అనే మొబైల్ అప్ ని నిన్న గురువారం నాడు ఆవిష్కరించారు. ఈ మొబైల్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ మీద పనిచేస్తుంది. ఈ ‘నా ఓటు’ యాప్ తో ఓటర్లు తమ యొక్క ఎలక్షన్ గుర్తింపు కార్డు నెంబర్, కేటాయించబడిన పోలింగ్ కేంద్రం యొక్క వివరాలు, వికలాంగులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి పోలింగ్ కేంద్రం వరకు పికప్ మరియు డ్రాప్ వంటి సదుపాయాలు, పోలింగ్ కేంద్రానికి చేరుకోవడానికి దారి, ఎక్కవలసిన బస్సు వివరాలు మొదలగు సౌకర్యాలను ఇందులో పొందుపరిచామని రజత్ కుమార్ పేర్కొన్నారు.

ceo-ranjith-kumar

అంతేకాకుండా, ఈ యాప్ కి లోగో డిజైన్ చేయాలనుకున్న ఔత్సాహికులకు 15 వేల రూపాయల బహుమానం కూడా ప్రకటించారు. దరఖాస్తులను naavotets@gmail.com కు మెయిల్ చేయాలని తెలిపారు.అంతేకాకుండా, ఇంటర్నెట్ సదుపాయం కలిగిన పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్-కాస్టింగ్ సదుపాయం ద్వారా పోలింగ్ ను లైవ్ లో చూసుకొనే సదుపాయం కూడా కల్పిస్తున్నామని తెలిపారు. ఐటీ సంస్థలు తమ కంపెనీ పరిసరాల్లో పోలింగ్ కేంద్రాలను నిర్వహించాలని కోరగా అది సాధ్యపడే విషయం కాదని తేల్చిచెప్పారు. డిసెంబర్ 7 న రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనున్నందున అన్ని సంస్థలు సెలవు ప్రకటించాలని స్పష్టం చేశారు.