5జీ వినియోగంలో చైనా అగ్రస్థానం

5జీ

చైనా 5జీ టెలికం సేవలు ప్రారంభించింది. చైనాకు చెందిన మూడు దిగ్గజ టెల్కోలు ఈ సర్వీసులు ప్రారంభించాయి. 5జీ సేవలు బీజింగ్, షాంఘై ఇంకా పలునగరాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉండ నున్నాయి అని చైనా మొబైల్‌ సంస్థ తెలిపింది. టెక్నాలజీ వినియోగంలో అమెరికా కన్నా ముందు ఉండే ప్రయత్నంలో చైనా ఉంది. ప్యాకేజీలు నెలకు 128 యువాన్ల నుంచి ప్రారంభం అవుతాయని పేర్కొంది. అటు పోటీ సంస్థలైన చైనా టెలికం, చైనా యూనికామ్‌ కూడా ఇదే స్థాయి టారిఫ్‌లతో సర్వీసులు అందిస్తున్నట్లు ప్రకటించాయి.

5జీ సేవ ప్రస్తుతం ఉన్న 4జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే 100 రెట్లు వేగంగా ఉండనున్నదని సమాచారం. సెకన్ల వ్యవధిలోనే పూర్తి నిడివి సినిమాను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు అని తెలిపింది. వచ్చే ఏడాది నాటికి 17 కోట్ల మంది యూజర్లతో చైనా అగ్రస్థానంలో నిలుస్తుందని అంచనా. ఇంకా రెండో స్థానంలో దక్షిణ కొరియా అమెరికా మూడో స్థానంలో ఉండబోతున్నాయి.