వాట్సాప్‌ గూఢచర్య

వాట్సాప్‌ గూఢచర్య

ఇజ్రాయెల్‌లోని ఎన్‌ఎస్‌ఓ టెక్నాలజీ సంస్థ నుంచి కొనుగోలు చేసిన పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌తో గుర్తు తెలియని వ్యక్తులు నిఘా వేస్తున్నారని తెల్సింది. ఈ విషయం వెలుగులోకి రావడం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మానవ హక్కుల కార్యకర్తలు, దళిత కార్యకర్తలు ఇంకా కొందరి వాట్సాప్ అకౌంటులపైన నిఘాచేస్తున్నట్టు సమాచారం. వాట్సాప్‌లో ఫోన్‌ కాల్స్‌ను విని రికార్డు చేస్తున్నారు. వాట్సాప్‌ సందేశాలను, ఫొటోలను, పాస్‌వర్డ్‌ లను కూడా తస్కరిస్తున్నారు.

వాట్సాప్‌’ యాజమాన్యాన్ని కేంద్ర మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ కోరుతూ.. ఇది పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే పని. పౌరులను ఆర్థికంగా కొల్లగొట్టేందుకు ఉపయోగిస్తున్న సాఫ్ట్‌ వేర్‌ దొంగలు ఎవరని అడిగారు.

ఎన్‌ఎస్‌ఓ సంస్థ పెగాసస్‌ అనే స్పైవేర్‌ను తానే అమ్మినట్లు తెలిపింది. 2010లో ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ నగర సమీపంలో ఏర్పడ్డది. స్పైవేర్ మిస్సిడ్‌ కాల్‌ ద్వారా వాట్సాప్‌లోకి ప్రవేశిస్తుంది. ఎన్‌ఎస్‌ఓ సంస్థ ప్రభుత్వ సంస్థలకు తప్ప ఇంకా వేరే ఎవరికి ఇలాంటి సాఫ్ట్‌ వేర్‌ను  అమ్మలేదని చెప్తుంది.