‘మనం’ తర్వాత విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో మరోసారి నటిస్తున్నారు నాగచైతన్య. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఇటీవల ఈ చిత్రాన్ని ప్రకటించారు. ‘థ్యాంక్యూ’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తారు. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ కనిపించే అవకాశం ఉందని తెలిసింది. రకుల్ ప్రీత్‌సింగ్, తమిళ నటి ప్రియా భవానీ శంకర్లను ఈ సినిమాలో హీరోయిన్లుగా తీసుకోవాలని చిత్రబృందం అనుకుంటున్నారట.
గతంలో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో జంటగా నటించారు చైతన్య, రకుల్. మరి ‘థ్యాంక్యూ’లో జంటగా కనిపిస్తారా? అనేది త్వరలో తెలిసిపోతుంది. హీరోయిన్ల గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయని సమాచారం. అక్టోబర్ మొదటి వారంలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.