ఛల్ మోహన్ రంగా రివ్యూ…. తెలుగు బులెట్

Chal Mohan Ranga review

సినిమా : ఛల్ మోహన్ రంగా
నటీనటులు : నితిన్, మేఘా ఆకాష్, రావు రమేష్, మధునందన్, డా.కె.వి.నరేష్, లిజి, రోహిణి హట్టంగడి, సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రాశ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి, కిరీటి
సంగీతం: థమన్.ఎస్.ఎస్
కెమెరా : ఎం.నటరాజ సుబ్రమణియన్
సమర్పణ : శ్రీమతి నిఖిత రెడ్డి
నిర్మాత : ఎం.సుధాకర్ రెడ్డి
కథ : త్రివిక్రమ్ శ్రీనివాస్
స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: కృష్ణ చైతన్య

‘నితిన్, మేఘా ఆకాష్’ రెండో సారి జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా ఈ సినిమాని తెరకెక్కించడంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అంతే కాకుండా మాటల మాంత్రికుడు ,దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తుండం వల్ల ఆ అంచనాలని మరింత పెంచేశాయి. అయితే ఈ ప్రేక్షకుల అంచనాలని ఎంతవరకు ఈ సినిమా అందుకుంది అనేది చూద్దాం.

కథ…

హీరో హీరొయిన్ లు గాయాలతో హాస్పటిల్ కి వచ్చే సీన్ తో సినిమా మొదలవుతుంది. అక్కడ మోహన రంగా (నితిన్) మనకి తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. మోహన రంగా కి నరేష్, ప్రగతి తల్లిదండ్రులు చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన వల్ల మోహన రంగా అమెరికా వెళ్ళడమే ధ్యేయం అనుకుని పెరుగుతాడు. చదువులో అంతంతమాత్రమే అవడంతో మూడు సార్లు వీసా రిజెక్ట్ అవుతుంది.

ఎలాగోలా అమెరికా వెళ్ళిన మోహన రంగా కి మేఘా సుబ్రహ్మణ్యం (మేఘా ఆకాష్) తారసపడుతుంది. ముందు ఫ్రెండ్స్ అవుతారు, తరువాత ఒకరినొకరు ఇష్టపడి వారి ప్రేమని వ్యక్తం చేసే లోపే వాళ్ళిద్దరూ విడిపోతారు. మేఘా ఇండియా వచ్చేస్తుంది. తర్వాత మోహన రంగా మేఘ ని వెతుక్కుంటూ ఇండియా వస్తాడు.

అసలు మోహన రంగా, మేఘా ఎందుకు విపోయారు? మోహన రంగా ఇండియా వచ్చిన తరవాత ఏమయ్యింది ? అసలు వాళ్ళిద్దరికీ ఆక్సిడెంట్ ఎందుకు అయ్యింది ? వీళ్ళిద్దరూ ఎలా ఒక్కటయ్యారు ? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

స్వతహాగా పాటలు రాసే కృష్ణచైతన్యకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరక్షన్ పై కూడా మంచి పట్టుంది అనే విషయాన్ని నిరూపించాడు. ఆయన మొదటి సినిమా రౌడీ ఫెలో సినిమా చూస్తేనే ఆయనకీ డైరెక్షన్ మీద ఉన్న పట్టు మనకి అర్ధం అవుతుంది. ఛల్ మోహన్ రంగ సినిమాను కూడా ఈ కుర్ర డైరక్టర్ బాగా హ్యాండిల్ చేశాడు.

హీరో హీరోయిన్లను అందంగా చూపించడంతో పాటు డైలాగ్స్ పై ప్రత్యేక దృష్టిపెట్టాడు. సినిమాలో డైలాగ్స్ అందర్నీ ఎంటర్ టైన్ చేస్తాయి. సినిమాలోని నిర్మాణ విలువలు, రిచ్ నెస్ సినిమాకి బాగా ప్లస్. హీరో నితిన్ తన పాత్రలో చాలా ఈజ్ తో నటించాడు. డాన్స్ కూడా కొంతమేరకి ఇంప్రూవ్ అయ్యాడనే చెప్పాలి. సినిమాలో కామెడి బాగా పండింది. త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ సినిమాలో బాగున్నాయి. సినిమా మొత్తం త్రివిక్రమ్ బ్రాండ్ అన్నట్టు సాగింది.

తమన్ బ్యాక్రౌండ్ మ్యూజిక్ సినిమా చాలా ప్లస్ అయ్యింది. హీరో హీరోయిన్ మద్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ‘లై’ సినిమా ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేక పోయినా నితిన్, మేఘా ఆకాశ్ జంట పెర్ఫామెన్స్ పరంగా పాత్రలకు న్యాయం చేశారు. ఫస్ట్ ఆఫ్ సినిమా చాలా ఆశక్తికరంగా సాగుతుంది. కాని సెకండ్ ఆఫ్ మాత్రం తేలిపోయింది. రొటీన్ కథే అయినా ఎక్కడా బోర్ కొట్టకుండా లాక్కొచ్చాడు దర్శకుడు కృష్ణచైతన్య.

ఈ హాట్ సమ్మర్ లో నితిన్ ప్రేక్షకులకి మంచి కూల్ సినిమా గిఫ్ట్ ఇచ్చాడని అనుకోవాలి… ఈ ఏడాది రంగస్థలం తో మొదలయిన హిట్ ల పరంపర ని కొనసాగించేలా ఉంది నితిన్-త్రివిక్రమ్-పవన్ ల ఛల్ మోహన రంగా.

ప్లస్ పాయింట్స్ .
తమన్ మ్యూజిక్
నితిన్-మేఘా ల రొమాన్స్
కామెడీ
నిర్మాణ విలువలు
ఫోటోగ్రఫీ

మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
బోరింగ్ సెకండ్ హాఫ్

తెలుగు బులెట్ పంచ్ లైన్… ఈ హాట్ సమ్మర్ లో కూల్ ‘ఛల్ మోహన్ రంగా’ ని చూసి తీరాల్సిందే.
తెలుగు బులెట్ రేటింగ్… 2.75 /5 .