Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా సాధన ఉద్యమం రొజురొజుకీ ఉధృతమవుతోంది. హోదా సాధన కోసం ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ బంద్‌కు పిలుపునిచ్చింది ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి. సాధన సమితి ఇచ్చిన ఈ బంద్ పిలుపుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు కూడా ఈ బంద్‌కు మద్దతు తెలిపాయి. ఢిల్లీలో తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులపై దాడి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుల దీక్ష భగ్నానికి నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిట్టుగా హోదా సాధన సమితి తెలిపింది.
ఈమేరకు ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్ ఈరోజు మాట్లాడుతూ 16వతేదీన బంద్‌కు పిలుపునిస్తున్నామని, అయితే… అత్యవసర సేవలకు బంద్ నుంచి మినహాయింపునిస్తున్నామన్నారు. ఇప్పటికే హోదా కోసం రోడ్డెక్కి పలు దఫాలుగా నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నాయి వివిధ రాజకీయ పక్షాలు. హోదా కోసం ఉద్యమాలు, నిరసనలు, ఆందోళనలు చేస్తున్నా కేంద్రం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ప్రత్యేక హోదా సాధన సమితి. ఈ బంద్‌కు రాజకీయ పార్టీలతో పాటు పలు ప్రజాసంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. కానీ
బంద్‌లు, రాస్తారోకోలు, రైలు రోకోల వల్ల రాష్ట్ర అభివృద్ది దెబ్బతినే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. బంద్‌లతో మనల్ని మనమే శిక్షించుకోవడమేనని అల్లర్లు, అశాంతి ఉంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారు వెనుకడుగు వేసే అవకాశం ఉందన్నారు. బంద్‌లతో మనల్ని మనమే ఇబ్బంది పెట్టుకొంటే మోడీ ఆనందపడతాడని అన్నారు.
ఢిల్లీలో పోరాటం చేయాలని ఆయన ఆందోళనకారులకు సూచించారు. ప్రత్యేక హోదా విషయమై ఢిల్లీలో పోరాటం చేసే వారికి తాను అన్ని రకాలుగా అండగా ఉంటానని ఆయన చెప్పారు. రాష్ట్ర అభివృద్ది నిలిచిపోయేలా నిరసనలు చేయకూడదని ఆయన నిరసనకారులను కోరారు. ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. ఏపీకి ఇచ్చిన హమీలు అమలు చేయకుండా మోసం చేసిన బిజెపి అరాచకాలను బట్టబయలు చేస్తానని బాబు