Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రు లో రగిలిన చిచ్చు కులవిద్వేషాల ఫలితమే అని ప్రచారం చేసి రాజకీయ చలిమంటలు కాచుకుందామని కొందరు ప్రయత్నిస్తున్నారు. అయితే అందులో నిజం లేదంటున్నారు ఆంధ్ర మేధావుల ఫోరమ్ నాయకుడు చలసాని శ్రీనివాస్. స్వయంగా ఆ వూరు వెళ్లి వచ్చిన ఆయన గరగపర్రు వివాదంలో కొత్త కోణాల్ని అందిస్తున్నారు. అదేమిటో ఆయన మాటల్లోనే …
1.పశ్చిమ గోదావరి జిల్లా, గరగపర్రు.. ఇంతకుముందు భీమవరంనుండి తాడేపల్లిగూడెం వెళ్ళేదారిలో ఉండేది, ఎప్పుడూ ఆగలేదు. కానీ గత 4 రోజులలో ఆ ఊరికి వెళ్ళటానికి 3 రోజులు పోలీసుల ఆంక్షల వల్ల, మరొకరోజు రాజకీయ నాయకులుండగా వెళ్ళటానికి నేను ఇష్టపడని కారణంగా కుదరాలా… ఆఖరిగా ప్రయత్నం చేసి నేడు నేను, న్యాయవాది రావూరి చాచా మొదలగువారం వెళ్లటంలో సఫలీకృతమయ్యాము.
గత కొన్ని రోజులుగా ఉద్యమ నాయకుల గొప్ప పోరాటం ఫలితంగా, అక్కడి ప్రజల పట్టుదల, సోషల్ మీడియాలో చైతన్యం వల్లకూడా, ముఖ్య డిమాండ్ అయిన నిందితుల అరెస్టులు జరిగిన నేపథ్యంలో, నేటి సాయంత్రం నిరాహారదీక్షలో ఉన్న దళితనాయకుల దీక్షలు విరమింపచేసాము. అయితే వారికి ఉపాధి కల్పన, గౌరవ ప్రదమైన జీవన అశ్వాసన రావాల్సిఉంది. ఇది నేెను స్పష్టంగా చెప్పాను. ఆది ఇప్పుడు అమలుకావాలి. తరువాత వూరిలో అందరితో సమన్వయంతో జీవనం గడవాలి.
కారణాలు ఏమైనా(తరువాత వివరంగా అందరం విశ్లేషిద్దాము) పొరపాటు జరిగింది. అందరి ఆమోదంతో చేయాల్సిన దానిలో కొద్దిగా తొందరపాటు కొద్దిమంది పడితే, దానికి తిరుగుడుగా అన్నట్లు కొందరు మిగిలినవారిని నానా యాతనలకు గురిచేశారు. అది అమానవీయం.
2. ఆ వూరిలో దళితుల మినహా 15 కులాల వారు ఒక విజ్ఞాపన ఇచ్చారు. వారి వాదన కూడా విన్నాను. అక్కడి సర్పంచ్ దళిత మహిళ కూడా వారి వర్గంలోనే ఉన్నారు. మనము ఏదీ ఏకపక్షంగా ఉండకూడదు. జరిగిన కొన్ని వాస్తవాలు వారు కూడా వివరించారు. మంచినీటి చేరువుకట్టపై విగ్రహాల ఏర్పాటు ఇక వద్దన్న సం. నాటి పాత తీర్మానం,+ కలెక్టర్ ఆదేశాలు చూపించారు. వారి వైపు వాదన కూడా మనందరం వినడం అవసరం.
కానీ జరిగిన సామాజిక బహిష్కరణ, నాలాంటి వారు అత్యంత గౌరవించే బాబా సాహెబ్ అంబెడ్కర్ విగ్రహం విషయంలో జరిగింది చూస్తే దళితులకు అన్యాయం జరిగిందిి. అధికారవర్గాలు దాదాపు 2 నెలలు ఈ బహిష్కరణని పట్టించుకోలేదు. అలాగే దాదాపుగా అన్ని అధికార ప్రతిపక్షాలు కూడా. అది చాలా తప్పు. అందువల్ల మొదటిగా మనం దళితులవైపు ఉండాలి. అలాగే అంతిమంగా న్యాయం గెలవాలని చూడాలి.
3. ఆ వూరిలో నా అంచనా ప్రకారం 99% ప్రజలు చాలా మంచివారు, నెమ్మదివారు. నేను రెండు వర్గాలవారితో మాట్లాడాను. వందల సం. తరతరాలు గడిపిన కుటుంబాల మధ్యన ఇంత పొరపొచ్చాలు వచ్చినా, ఇంకా ప్రేమాభిమానాలు ఉన్నాయి. అయితే అపోహలు తొలగాలి. న్యాయం జరగాలి. మనుషులలో ఉన్న ఆ సున్నితత్వాన్ని ఇంకా దెబ్బతీయకూడదు.
ఓట్లకోసం వాలిపోయే కొందరు రాజకీయనాయకులని దూరంపెట్టి సామాజిక, అభ్యుదయ ఉద్యమకారులని చర్చలకు కూర్చోపెడితే 4 గం. లలో పరిష్కారం అయ్యే సమస్య. ఉద్వేగాలు రెండువైపులా పెంచడం తేలికే. వారికే బయట ఎక్కువ మద్దతు వస్తుంది. హేతుబద్దతతో పరిష్కారం ముఖ్యము. వారు, వారు అక్కడ వూళ్ళో కలసి ఉండాల్సినవారు కదా.
-చలసాని
మరిన్ని వార్తలు
జగన్ కులాల కౌంటింగ్