వెంకయ్యని తప్పించారా ?

chalasani srinivas yadav comments on modi and amit shah

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వెంకయ్యకి ఉప రాష్ట్రపతి పదవి ప్రమోషన్ అని భావించే వాళ్ళు ఎందరో డిమోషన్ అనుకునే వాళ్ళు కూడా దాదాపుగా అంతే వున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆయన ఉప రాష్ట్రపతి కాకుండా ఉంటే బాగుండని ఎంతోమంది కోరుకున్నారు. అయితే వారి కోరిక ఫలించలేదు. వెంకయ్యని ఉప రాష్ట్రపతి బరిలో నిలపడమంటే ఆయనని తమకు అడ్డు లేకుండా చూసుకోవడమే అని ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీద వస్తున్న ఆరోపణ. ఇదే అంశం మీద ఆంధ్ర మేధావుల సంఘం నేత చలసాని శ్రీనివాస్ అభిప్రాయం ఇలా వుంది.

వెంకయ్య గారికి వారి పార్టీలో వ్యతిరేకులు, పార్టీ నిర్ణయబద్ధులు, విషయాలు లోతుగా అర్ధం చేసుకోలేని కొద్దిమంది బయటి శ్రేయోభిలాషులు తప్ప ఆయన ప్రస్తుతం ప్రభావంతంగా నడుపుతున్న చలనశీల రాజకీయాలు, పనిచేసే పదవులు, పని నుంచి తప్పుకుని, గలగలా మాట్లాడే నోరు బందు చేసుకుని, మొహమ్మద్ హమీద్ అన్సారీ గారు అనే ఒకాయన ఖాళీ చేసే ఒక గౌరవ పదవిలోకి వెళ్ళటాన్ని హర్షించరు. కొందరు బలవంతంగా పొగుడుతున్నారు :). ఉపమానానికి కాకపోయినా, చలనశీలిగా ఉండటానికి ఇష్టపడేవారిని పెద్ద పదేకరాల జైలులో పెడితే ఉండగలరా అనేది కొందరి సందేహం? మీరూ కొంత లోతుగా ఆలోచిస్తే విషయం అర్ధం చేసుకోవచ్చు.

అద్వానీ, మురళీ మనోహర జోషీ గారు కొందరు ఇతర పెద్దలకు అవమానం తరువాత ‘ఆ ఇద్దరి గుజరాతీ పెద్దల’ దెబ్బకు పడాల్సిన వికెట్ ఇదేనని మాలాంటి వారు ముందే ఊహించాము. ఇక సుష్మాస్వరాజ్ గారు, రాజనాధ్ గారి లాంటి వారికి కూడా ఇలానే కాస్త గౌరవప్రదమైన వీడ్కోలు పలుకుతారు.

వెంకయ్య గారి మీద కూడా హోదా, హామీల అమలు కోసం తీవ్ర వత్తిడి చేసాం. ఘోరావ్, నిలదీతలు కూడా చేసాము. పైన ‘ఆ ఇద్దరికీ’ ఏపీకి హామీలు అమలు చేయడం ఇష్టం లేకపోయినా ఈయన వారిపై వత్తిడి తీసుకువస్తారని ఆయన్ను గట్టిగా విమర్శించాము. ఆయన కూడా ఆయన మంత్రివర్గ విభాగంలో కొంత, ఇంకొన్ని తప్ప మరేమీ చేయలేక అనుకుంటా, హుందాతనాన్ని కోల్పోయి పైవారు వద్దన్నారని చెప్పుకోలేక అసహనంతో మా మీద విమర్శలు చేసారు. మాసమితి అందరూ ఉండగానే నా మీదే విరుచుకుపడ్డారు కూడా వారి పార్లమెంటు గదిలో.

వారు ఇప్పుడు అలా వెళ్లిపోవడం ఏపీకి అలాగే కొంతవరకు తెలంగాణకు, తెలుగువారికి ఒక విధంగా నష్టం కూడా. ఇంతకుముందులా 30 మంది మంత్రులను రాష్ట్రం కోసం పిలిపించుకుని పదే పదే అడగలేరు.ఇది వెంకయ్య గారిపై అభిమానంతోనో లేదా కోపంతోనో పెట్టిన పోస్టు కాదు. పనిచేసే మంత్రిపదవులు పీకేసి తెలుగువాడికి తెలివిగా “జరిగిన సన్మానం” పై, అలాగే ఇక హోదాపై అడిగిన ఆయనే రాజకీయాలలో లేకుండా పోయారు ఇక అవేమి వస్తాయని వారిద్దరూ,(At present in AP both ruling, n main opposition supporting the duo’s candidates without firmly demanding implementation of assurenses given at the time of bifurcativon) వారి అనుచరులూ హేళన చేస్తారని బాధతో ఆంధ్రావాడిగా ఒక తెలుగువాడిగా పెట్టినదే.

47 ఏళ్ల క్రితమే ఉద్యమ నాయకుడై అరెస్టులై, 40ఏళ్ల క్రితమే శాసన సభ్యుడిగా ఎన్నికై, ఎదిగి నేడు అంతటి దేశస్థాయికి ఎదిగిఉన్న దక్షిణ భారత దేశ నాయకుడు, ఆ పార్టీలో ‘ఆ ఇద్దరి’ కంటే సీనియర్ కూడా ఐన ఆయన ప్రత్యక్ష రాజకీయాలలో లేకుండా పోయారు. మోదీ గారి మోములో అదో రకం భావాలు, అమితం గారి ఆనందం + అదొరకం పలుపుతాడులు, ఒకవైవు.. బలవంతపు మోముతో వెంకయ్య గారు చిక్కుకున్న ఆ చిత్రం కూడా చూడండి. తమ ఆలోచన ప్రకారం చాలా లోతుగా గుజరాతీ తెలివితో తీసుకున్న మరో నిర్ణయం ఇది. -చలసాని

మరిన్ని వార్తలు

గరుడపురాణం అసలు రహస్యం మీకు తెలుసా?

రైల్వే సాక్షిగా వైసీపీ స్కెచ్ ?

ట్వీటుతోనే హీటు పుట్టిస్తున్న కమల్