Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాగశౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ‘ఛలో’ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రంలోని ఒక పాట ఇటీవల సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్‌లో తెగ హల్ చల్ చేస్తోంది. పలువురు ఈ పాటను సొంతంగా కొరియోగ్రఫీతో యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. దాంతో సినిమాపై అందరిలో ఆసక్తిరేకెత్తింది. సినిమా ఎలా ఉంటుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే నెల 2న చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ట్రైలర్ విడుదల చేసి సినిమాపై క్లారిటీ ఇచ్చేశారు.
ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను ‘ఛలో’ చిత్రం అందుకుంటుందనే స్థాయిలో ట్రైలర్ లేదు. పరమ రొటీన్‌గా, ఏమాత్రం కొత్తదనం లేకుండా మూస ఎంటర్టైన్మెంట్తో, తెలుగు మరియు తమిళ మనుషుల మద్య ఉన్న ఏదో గొడవ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇలాంటి కథలు మరియు కథనాలు గతంలో ఎన్నో వచ్చాయి. కనుక సినిమా ట్రైలర్లో చూపించినట్లుగానే పూర్తిగా ఉంటే మాత్రం ఫలితం తలకిందులు అవ్వడం ఖాయం.
ట్రైలర్లో కాకుండా సినిమా కొత్తదనంతో ఉన్నట్లయితే అప్పుడు ప్రేక్షకులు ఆధరించే అవకాశం ఉంది. ట్రైలర్ సూపర్ హిట్ అయిన సినిమాలు ఫ్లాప్ అయిన సందర్బాలు ఉన్నాయి. అందుకే ఈ ట్రైలర్ ఆకట్టుకోలేదు కనుక సినిమా బాగోదు అనే నిర్ణయానికి రావడం మంచిది కాదు. అందుకే సినిమా విడుదలయ్యే వరకు ఎదరు చూస్తే ఫలితం ఏంటో తేలిపోయే అవకాశం ఉంది. పెద్దగా పోటీ లేని సమయంలో ‘ఛలో’ విడుదలకు సిద్దం అవుతున్న నేపథ్యంలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కలెక్షన్స్ పాజిటివ్‌గా ఉండే అవకాశం ఉంది.