అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం ఫై చంద్రబాబు విమర్శలు

అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం ఫై చంద్రబాబు విమర్శలు

శాసన మండలి రద్దు చేస్తూ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం ఫై చంద్రబాబు విమర్శలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే రెఫరెండం పెట్టడం, లేదంటే అసెంబ్లీ రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్దాం అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల ఫై వైసీపీ నేత ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి ఘాటు విమర్శలు చేసారు. చంద్రబాబు వ్యాఖ్యలకు స్పందిస్తూ విజయసాయి రెడ్డి ఇలా అన్నారు “దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి, రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే కౌన్సిల్ రద్దు సమర్థిస్తామని రంకెలు వేసే బదులు మీరంతా రిజైన్ చేసి గెలవండి. రెఫరెండం గా భావిస్తాం నోరు తెరిస్తే దమ్ము, సత్తాల గురించి మాట్లాడటం తప్ప వాటిని ప్రదర్శించే సాహసం మాత్రం చేయడు. ఇంకా 1990 లోనే ఉంటే ఎలా బాబు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను, టీడీపీ అభిమానులు స్పందిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇలా విమర్శలు చేసే బదులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి పదవులకు రాజీనామా చేయించవచ్చుగా అంటూ కామెంట్లు చేసారు. మంత్రుల మోపిదేవి, సుభాష్ చంద్రబోస్ శాసన మండలిలో ఎమ్మెల్సీ పదవుల ద్వారా మంత్రులు అయిన సంగతి అందరికీ తెల్సిందే.