ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై చంద్రబాబు ఆగ్రహం

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై చంద్రబాబు ఆగ్రహం

ప్రజలు హైకోర్టు కోసం ఒక జిల్లాకు, సచివాలయం కోసం మరొక జిల్లాకు వెళ్లాలా అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇది నా మీద కోపమా లేకపోతె అమరావతి మీదనా అంటూ విరుచుకుపడటమే కాకుండా ఇది తుగ్లక్ నిర్ణయం కాదా అని అన్నారు. నిపుణుల కమిటీ రాకముందే ఇలాంటి నిర్ణయం ప్రకటించడం ఏమిటి అని ధ్వజమెత్తారు. టీడీపీ ఎమ్మెల్యేలను బఫున్ లు అన్నారు. ఇపుడే ఆయనే పెద్ద బఫూన్ అయ్యారు అని విమర్శించారు.

దేశంలో ఇలాంటి నిర్ణయం ఎక్కడా తీసుకోలేదని తెలుస్తుంది. అస్థిరత్వానికి నాంది పలకడం అంటే ఇది కాక ఇంకేంటి అన్నారు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే తనని తాను కొట్టుకోవడమో, ఇతరులని కొట్టడమో చేస్తారు. ముఖ్యమంత్రి జగన్ ఎపుడు ఎం చేస్తారో అని విమర్శలు చేసారు.

అవినీతి ఆరోపణలు ఇప్పటివరకు చాల చేసారు. రాజధాని భూములు విషయం లో అవినీతి జరిగి ఉంటే అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని అన్నారు. హెరిటేజ్ భూములు రాజధాని ప్రాంతంలోకి రావని అన్నారు. అయితే భూములు ఎవరు కొన్నా అవి టీడీపీ వారికి , తమ కుటుంబ సభ్యులకి ఆపాదించేలా ఉద్దేశపూర్వకంగానే అంటున్నారని జగన్ ఫై విరుచుకుపడ్డారు చంద్రబాబు.