చంద్రబాబును దెబ్బ కొట్టాలన్నది జగన్ టార్గెట్

చంద్రబాబును దెబ్బ కొట్టాలన్నది జగన్ టార్గెట్

చంద్రబాబును కట్టడి చేయటానికి జగన్ ప్లే చేసిన అనేక వ్యూహాల్లో వలసలు కూడా ఒకటి. సీన్ కట్ చేస్తే ఇపుడు కూడా అలాంటి వ్యూహమే అమలు చేస్తున్నాడు జగన్.స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా చంద్రబాబును కోలుకోలేకుండా దెబ్బ కొట్టాలన్నది జగన్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. అసలే మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుండి కోలుకోలేదు. దానికితోడు వెంటనే స్ధానిక సంస్ధల ఎన్నికలంటే ద్వితీయ శ్రేణి నేతలెవరూ ముందుకు రావటం లేదు. స్వయంగా చంద్రబాబే ఫోన్ చేసినా ఎవరూ స్పందించటం లేదు. గట్టి అభ్యర్ధులే దొరకక చంద్రబాబు నానా అవస్తలు పడుతుంటే టిడిపి నుండి హఠాత్తుగా వలసలు ఊపందుకున్నాయి.

గడచిన రెండు రోజుల్లో ఏడుగురు మాజీ ఎంఎల్ఏలు, మాజీ మంత్రులు టిడిపికి రాజీనామాలు చేసి వైసిపిలో చేరారు. డొక్కా మాణిక్యవరప్రసాద్, రహమన్, సతీష్ రెడ్డి, కదిరి బాబురావు, రామసుబ్బారెడ్డి లాంటి సీనియర్లు చేరటంతో చంద్రబాబుకు షాక్ తగిలింది. ఈ వలసలు మరింతటా ఊపందుకనే అవకాశాలు కనిపిస్తున్నాయి. టిడిపిని ఏ దశలో కూడా కోలుకోనీయకుండా చేయాలన్న జగన్ వ్యూహంలో భాగంగానే ఇదంతా నడుస్తోందని అర్ధమైపోతోంది. ఏదేమైనా జగన్ మైండ్ గేమ్ ను చంద్రబాబు తట్టుకోలేకపోతున్న విషయం తెలిసిపోతోంది.