Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Chandra Babu Naidu Brings Good Name To Son And Daughter In Law
ఓ కుటుంబంలో ఓ సెలబ్రిటీ ఉండమే గొప్ప. అలాంటిది ఏపీ సీఎం చంద్రబాబు ఫ్యామిలీలో మాత్రం అందరూ సెలబ్రిటీలే. చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రహ్మణి గురించి ఏ వార్త వచ్చినా.. అది హాట్ టాపిక్ అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వీరి ఫ్యామిలీ వ్యవహారాలపై ఆసక్తి ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్ వేసిన పునాదులు అలాంటివి.
ఇప్పుడు చంద్రబాబుకు నిజమైన పుత్రోత్సాహం కలిగించే ఘటన మరోసారి జరిగింది. తాను ఒక్కడే తొలిసారిగా సొంత జిల్లాలో పర్యటించిన నారా లోకేష్.. పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా వ్యవహరించడం టీడీపీ శ్రేణులకు ఆనందం కలిగించింది. పీలేరు, పుంగనూరులో పర్యటించిన లోకేష్ ను చూడటానికి జనం కూడా భారీగా తరలిరావడం శుభసూచకమంటున్నాయి పార్టీ వర్గాలు.
అటు హెరిటేజ్ ప్రోగ్రామ్ కోసం శాంతిపురంలో పర్యటించిన బ్రహ్మణికి అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. బ్రహ్మణి పాలిటిక్స్ లోకి రావాలని ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్న టీడీపీ శ్రేణులు.. ఆమెది ప్రైవేట్ ప్రోగ్రామ్ అయినా.. చాలా హడావిడి చేశాయి. ఎన్టీఆర్ మనవరాల్ని, బాలకృష్ణ కూతుర్ని చూడాలనే కోరికతో.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా భారీగా వచ్చినా.. బ్రహ్మణి ఓపికగా అందర్నీ పలకరించి మామకు తగ్గ కోడలు అనిపించుకున్నారు.
మరిన్ని వార్తలు: