జీఎన్ రావు నివేదిక లో అమరావతి భూములకు సంబందించిన వివరాలని వెల్లడించింది. దాదాపు 34 వేల ఎకరాల భూమిలో ఎవరెవరు ఎలా, ఎవరి వద్ద నుండి ఎవరు కొనుగోలు జరిపారనే పూర్తీ నివేదిక వున్నది అని అర్ధం అవుతుంది. అయితే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగి ఉంటుంది అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సిబిఐ విచారణ అంటూ నిన్న కొందరు వ్యాఖ్యలు కూడా చేసారు.
అయితే చంద్రబాబు వీటన్నిటిని ఖండిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు. విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ మీరు కూడా సిబిఐ విచారణ కు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. అయితే ఈ వ్యాఖ్యలకు గానూ వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు.
చంద్రబాబు నాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్ సంతాప సమావేశం లా వుంది అంటూ ఎద్దేవా చేసారు. మీరు అంత నిప్పు, పత్తి గింజ అయితే అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగనే లేదు, మా అందరికి ఒకే సారి కల వచ్చి 4 వేల ఎకరాల భూమి కొనుగోలు చేశామని చెప్పండి అంటూ విమర్శించారు. దీని ఫై దర్యాప్తు చేసి మాపై పడిన నిందను తొలగించమని సిబిఐ ని కోరండి, ఏం లేకపోతే అంత భయమెందుకు అంటూ సెటైర్లు వేశారు.