తీవ్ర చర్చనీయాంశంగా మారిన రాజధాని అంశం

తీవ్ర చర్చనీయాంశంగా మారిన రాజధాని అంశం

ఏపీలో గత కొద్ది రోజులుగా రాజధాని అంశం తీవ్ర చర్చానీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఏపీకి మూడు రాజధానులను తెరపైకి తీసుకురావడంతో రాజధాని అమరావతి రైతుల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎదురవుతున్నాయి. అయితే మూడు రాజధానులపై అటు ప్రతిపక్షాలు కూడా జగన్ ప్రభుత్వాన్ని ఘాటుగానే ప్రశ్నిస్తున్నాయి.

అయితే తాజాగా సీపీఐ నేత రామకృష్ణ రాజధానిపై సరైన స్పష్టత ఇవ్వాలంటూ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలైనటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశంలో కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. విశాఖను విజయసాయిరెడ్డి ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అని ప్రకటించారని, ప్రజలేమో రోడెక్కి నిరసనలు తెలుపుతున్నారని అన్నారు. అయితే రాజధాని అంశంపై తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.