Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
- ఆంధ్రప్రదేశ్లోప్రత్యేకంగా కొరియన్ సిటీని ఏర్పాటుచేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుతెలిపారు.
- దక్షిణ కొరియా పర్యటనలకు వెళ్లిన ఆయన తొలిరోజు పలువురు ప్రతినిధులతోభేటీ అయ్యారు.
- ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను రెండోరాజధానిగా చేసుకుని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
- పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకుప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
- ఈ పర్యటనలోభాగంగా చంద్రబాబు తొలుత కియా అనుబంధ సంస్థల ప్రతినిధులతో భేటీఅయ్యారు.
- ఆంధ్రప్రదేశ్‌లో తాము పెట్టబోయే పెట్టుబడుల ప్రణాళికపైకియా ప్రతినిధులు చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
- ప్రభుత్వ ప్రతిపాదిత ప్రాంతాల్లో ఎంతమేర పెట్టుబడులు పెట్టేది వివరించారు.
- తాము ఏర్పాటు చేసే సంస్థల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతమందికిఉపాధి అవకాశాలు లభిస్తాయో వెల్లడించారు.
- దక్షిణ కొరియాలోకియా అనుబంధ సంస్థల ప్రతినిధులందరినీ ఒకేసారి కలుసుకోవడం పైచంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.
- ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు.
- అనేక అవరోధాలు, ప్రతికూలతలను అధిగమించి దక్షిణకొరియా అభివృద ్ధిసాధించిన తీరు స్ఫూర్తిదాయకమని సీఎం కొనియాడారు.
- భౌగోళికంగా,జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్, దక్షిణకొరియా మధ్యనున్న సారూప్యతలను వివరించారు.
- ప్రపంచంలో భారత్ ఒక్కదానికే రెండంకెల వృద్ధిరేటు సాధించగలసామర్థ్యం ఉందన్నారు.
- గత మూడేళ్లుగా ఏపీ సుస్థిరంగా రెండంకెల వృద్ధిసాధిస్తోందని తెలిపారు.
- వచ్చే 15ఏళ్ల పాటు 15శాతం వృద్ధి నమోదు చేయాలన్నదేతమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
– బెల్లంకొండ సురేష్