ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాను చేసిన తప్పులని సరి చూసుకోవడం లేదని విమర్శించారు. అమరావతి రాష్ట్ర ప్రజల హక్కు అని, దాన్ని ఖచ్చితంగా పరిరక్షిస్తానని వారికి హామీ ఇచ్చారు. తాను జోలె పట్టింది ఐదు కోట్ల మంది ప్రజల కోసమేనని అన్నారు. మూడు రాజధానులకు ప్రజామోదం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో భూములు కొని అక్కడ డబ్బులు సంపాదిస్తున్నారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేసారు.
గతంలో తాను మొదలుపెట్టిన పనుల్ని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కొనసాగించారని అన్నారు. అయితే చంద్రబాబు తాను మొదలు పెట్టిన పనుల్ని కూడా వైయస్సార్ ఆపలేదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మాత్రం అలా కాదని, తండ్రి తీసుకొచ్చిన మండలిని రద్దు చేసారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే మంగళగిరి లోని పార్టీ ఆఫీస్ లో సమావేశమైన చంద్రబాబు మూడు రాజధానుల అంశం, మండలి రద్దు ఫై పార్లమెంటు లో ప్రస్తావించడానికి తగు దిశా నిర్దేశం చేసారు.