Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీ పాలిటిక్స్ లో నంద్యాల బై ఎలక్షన్ సెగలు పుట్టిస్తోంది. తెలంగాణలో సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. మరి ఏపీలో తొలిసారి జరుగుతున్న ఉపఎన్నికలో గెలుపెవరిది అనేది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు సర్వే ప్రకారం ప్రస్తుతం భూమా ఫ్యామిలీ వైపే మొగ్గు కనిపిస్తున్నట్లు తేలింది. దీనికి తోడు బాబు మార్క్ వ్యూహాలు తోడుగా ఉండటంతో సైకిల్ పార్టీకి గెలుపు పెద్ద కష్టం కాదనేది కార్యకర్తల మాట.
కానీ వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయొద్దని బాబు ఇప్పటికే నేతల్ను హెచ్చరించారు. వీలైనంతవరకూ బుత్ లెవల్లో పోల్ మేనేజ్ మెంట్ పక్కాగా ఉండాలని, లేదంటే భంగపాటు తప్పదని ముందస్తు హెచ్చరికలు జారీచేశారు. ఇప్పటికే నంద్యాల టూర్ ఖరారు చేసుకున్న బాబు… ఉపఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అటు జగన్ కూడా ప్రచారం చేయొచ్చు.
అధినేతల్లో ఎవరు ప్రజల్ని ఆకట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేకపోయినా… ఈసారి జగన్ ఏదో కొత్త ఎత్తుగడ వేస్తారని వైసీపీ నేతలు కొండంత ఆశగా ఉన్నారు. మరి జగన్ ఏం చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. టికెట్ కోసం పార్టీలు మారే వ్యక్తిని చేర్చుకుని జగన్ ఏం సాధిస్తారనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నంద్యాలలో టీడీపీ గెలిచి వైసీపీపై మరోసారి పైచేయి సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.