బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌ లో అమ‌రావ‌తి బాండ్ల లిస్టింగ్

chandrababu attends amaravati bonds listing at bse today

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు సీఆర్డీయే ఇటీవల బాండ్లను జారీ చేసిన సంగతి తెలిసందే. సీఆర్డీయే బాండ్లు జారీ చేసిన గంట వ్యవధిలోనే మదుపరుల నుంచి రూ.2 వేల కోట్లు వచ్చి పడ్డాయి. రాజధాని నిర్మాణం కోసం సీఆర్డీయే జారీ చేసిన అమరావతి బాండ్లను బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ)లో ఈరోజు ఉదయం నమోదు చేశారు. అంటే బీఎస్ఈలో అమ‌రావ‌తి బాండ్లు లిస్ట్ అయ్యాయన్న‌మాట‌.

chandra-babu

జ్యోతి ప్రజ్వలన అనంతరం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు 9.15 గంటలకు గంట కొట్టి నమోదును లాంఛనంగా ప్రారంభించారు. బీఎస్ఈ ఎండీ, సీఈవో ఆశీష్‌కుమార్ తో క‌లిసి చంద్ర‌బాబు బాండ్ల లిస్టింగ్‌ను ప్రారంభించారు. ఈ కార్య‌క్రమానికి మంత్రులు య‌న‌మ‌ల‌, నారాయ‌ణ‌, ఏపీ ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు కుటుంబ‌రావు సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ap-cm