బీజేపీతో బంధంపై చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు

Chandrababu comments on TDP and BJP alliance
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
బీజేపీతో పొత్తుపై జ‌గ‌న్ వ్యాఖ్య‌లు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వైసీపీ నేత బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డితో క‌లిసి మీడియా స‌మావేశంలో మాట్లాడ‌డం వంటి ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టిస్తే మ‌రో ఆలోచ‌న లేకుండా బీజేపీతో పొత్తుపెట్టుకుంటామ‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించిన త‌ర్వాత ఏపీలో వాడీ వేడీ చ‌ర్చ మొద‌ల‌యింది. దీనికి తోడు వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చి మంత్రుల‌యిన వారంతా రాజీనామా చేయాలంటూ బుగ్గ‌న‌తో క‌లిసి విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించిన త‌ర్వాత‌ బీజేపీ, వైసీపీ పొత్తుపై పెద్ద ఎత్తును ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. బీజేపీ టీడీపీతో చెలిమికి గుడ్ బై చెప్పి… వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీతో క‌లిసి పోటీచేస్తుంద‌నేది ఆ ఊహాగానాల సారాంశం.
దీనిపై స్పందించిన ముఖ్య‌మంత్రి బీజేపీ త‌మ‌ను వ‌ద్ద‌నుకుంటే ఓ న‌మ‌స్కారం పెట్టేసి త‌మ‌దారి తాము చూసుకుంటామ‌ని వ్యాఖ్యానించారు. బీజేపీతో తాము మిత్ర‌ధ‌ర్మం పాటిస్తున్నామ‌ని, దీనిపై బీజేపీ నేత‌లే ఆలోచించుకోవాల‌ని అన్నారు. బీజేపీ నేత‌లు ఎన్ని విమ‌ర్శ‌లు చేస్తున్నా… తాను టీడీపీ నేత‌ల‌ను చాలా వ‌ర‌కూ నియంత్రిస్తున్నానని చంద్ర‌బాబు చెప్పారు. బీజేపీతో పొత్తుపై జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పైనా సీఎం స్పందించారు. బీజేపీతో క‌లుస్తాన‌ని జ‌గ‌న్ చెప్ప‌డం ఇదే తొలిసారి కాద‌ని ఎద్దేవా చేశారు. ఒక మాట‌పై నిల‌బ‌డే వ్య‌క్తిత్వం జ‌గ‌న్ ది కాద‌ని విమ‌ర్శించారు. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోతే ఎంపీల‌తో రాజీనామా చేయిస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్… ఇంత‌వ‌ర‌కు ఎందుకు చేయించ‌లేద‌ని ప్ర‌శ్నించారు. కేసుల‌ను ఎత్తివేయించుకోడానికి, అక్ర‌మాస్తుల‌ను కాపాడుకోవ‌డానికే జగ‌న్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అక్ర‌మాస్తుల కేసుల్లో చిక్కుకున్న వారి ఆస్తుల‌ను స్వాధీనం చేసుకునేలా కేంద్ర‌ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టం తీసుకురావాల‌ని కోరారు.