అసలు అమిత్ షా ఎవరన్న చంద్రబాబు

chandrababu gives counter to amit shah

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కౌంట‌ర్ ఇచ్చారు. కేంద్రంలో ఎన్డీయే పాలన నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌కు బాబు కౌంట‌ర్ ఇచ్చారు. రాష్ట్రానికీ, రాజధానికీ నిధులు ఇవ్వకున్నా ఇచ్చామనడం దుర్మార్గమని అమరావతికి ఇచ్చిన నిధులకు యూసీలు పంపినా పంపలేదనడం మరింత దుర్మార్గమని అన్నారు. అసలు యూసీల గురించి మాట్లాడేందుకు అమిత్‌ షా ఎవరని చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘బీజేపీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి పాలనలో జోక్యం చేసుకోవడం ఏంటి? ఏదైనా ఉంటే ప్రధాని, కేంద్ర మంత్రులు చెప్పాలి. అని ఆయన పేర్కొన్నారు. అంతే కాదు..మాట్లాడితే ఏదన్నా ప్రధాని మోడీ, ఇతర మంత్రులు మాట్లాడాలి. వారు మౌనంగా ఉంటే అమిత్ షాకు ఏం పని అని ప్రశ్నించారు. మహానాడు వేదికగా షాకు చుక్కలు చూపించారు చంద్రబాబు.

అయితే ఇప్పుడు బాబు బీజేపీ మీద చేస్తున్న ఎదురు దాడి పార్టీలో చర్చనీయాంశం అయ్యింది. కర్నాటక సిఎం కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లి వచ్చాక చంద్రబాబులో ఉత్సాహం పెరిగినట్లుందని అందుకే క్యాడర్ ను చూసి మరింతగా బీజేపీ మీద ఎదురుదాడి చేస్తున్నారు చంద్ర‌బాబు దూకుడు చూసి ఇరు పార్టీల నేతలు అబ్బా అంటున్నారు. బీజేపీ నేత‌లు ఒక్క‌టి అంటే.. చంద్ర‌బాబు దానికి రెండు తగిలించి అంటున్నారు. ఏపీ విషయంలో వేలు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. చంద్ర‌బాబు విసురుతున్న స‌వాళ్ల‌ను బీజేపీ నేత‌లు గట్టిగా తిప్పికొట్టలేక పోతున్నారు. ఎందుకంటే ఏపీకి కేంద్ర ప్ర‌భుత్వం ఏం చేసిందో.. ఎన్ని నిదులు విడుద‌ల చేసిందో చెబుతున్నా సరిగా అవి పొసగడం లేదు. ఏపీలో టీడీపీని ఇర‌కాటంలో ప‌డేసేందుకు చేస్తున్న వ్యూహాల‌న్నీ బెడిసికొడుతుండ‌డంతో క‌మ‌ల‌ద‌ళం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.