తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా రాష్ట్ర పోలీసులందరికి ఒక రకమైన వార్నింగ్ ఇచ్చారు. కాగా శుక్రవారం నాడు విజయవాడ లో ధర్నా చౌక్ కి వెళ్లకుండా టీడీపీ నేత కేశినేని నానిని ఎందుకు అరెస్ట్ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. అంతేకాకుండా ఆయనకు పాలీసులు ముందస్తు నోటీసులు ఏమైనా ఇచ్చారా, ఆ నేత కేశినేని నాని తన ఇంటి నుండి ధర్నా చౌక్ కి వెళ్లడం తప్పా అని చంద్రబాబు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదంతా కూడా వైసీపీ ప్రభుత్వ అండ చూసుకొని పోలీసులు మరీ ఇంతలా రెచ్చిపోతున్నారని చంద్రబాబు విమర్శించారు.
ఇకపోతే ఇటీవల చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటనకు తాను వెళ్లినప్పుడు తన కాన్వాయ్ పై రాళ్లు విసిరితే, వారికి మద్దతుగా ఉన్నటువంటి పోలీసులు ప్రజలకు నిరసన తెలియజేసే హక్కు ఉందని చెప్పారని, కానీ కేశినేని నాని ఇలా నిరసనకు వెళ్తుంటే పోలీసులు ఇలా అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశినించారు. కాగా వీటన్నింటికి కూడా రాష్ట్ర డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈమేరకు రాష్ట్ర పోలీసులందరికి కూడా చంద్రబాబు నాయుడు ఓక వార్నింగ్ కూడా ఇచ్చారు.
కాగా ” ఓ సీనియర్ నాయకుడిగా పోలీస్ వ్యవస్థకు కూడా వార్నింగ్ ఇస్తున్నా.. లా అండ్ ఆర్డర్ పాటించండి, చట్టం అందరికీ సమానం.. కొందరికి చుట్టం కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి”… అంటూ హెచ్చరించారు. అంతేకాకుండా యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. “యువతకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ..మీ భవిష్యత్ కు సంబంధించిన అంశమిది. ఇలాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి వల్ల, పార్టీ వల్ల మీ భవిష్యత్ అంధకారమవుతుంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మీపైనే ఉంది” అని టీడీపీ అధినేత చంద్రబాబు వాఖ్యానించారు.