ఇవాళ చంద్రబాబు నాయుడు బెయిల్‌ పై విచారణ

Hearing on Chandrababu's bail cancellation petition today in the Supreme Court
Hearing on Chandrababu's bail cancellation petition today in the Supreme Court

ఇవాళ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెయిల్‌ పై విచారణ జరుగనుంది. ఇవాళ మధ్యాహం బెయిల్‌ పిటీషన్‌ పై విచారణ జరుగనుంది. అయితే.. దీనిపై రఘురామకృష్ణ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణకు రానుందని రఘురామకృష్ణ రాజు తెలిపారు.

గత వారంలో విచారణకు రాగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేరని ఈనెల 21 వ తేదీకి వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కోరారని, అయితే న్యాయమూర్తి గారు మాత్రం ఈనెల 15వ తేదీకి వాయిదా వేశారని తెలిపారు. ఇవాళ కోర్టులో విచారణ జరిగి వాదనలు పూర్తవుతాయా?, లేకపోతే మరుసటి రోజుకు వాయిదా పడతాయా అన్నది వేచి చూడాలని అన్నారు. అలాగే సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసు రిమాండ్ రిపోర్ట్ పిటిషన్ క్వాష్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు దాఖలు చేసిన పిటిషన్ పై అవినీతి నిరోధక చట్టంలోని 17A నిబంధన ప్రకారం కొట్టివేస్తారనే ఆశాభావాన్ని రఘురామకృష్ణ రాజు గారు వ్యక్తం చేశారు.