ఒక దేశప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి రప్పించలేని ఎన్నో పెట్టుబడులను సాధించి ప్రధానికి కంటిలో నలుసులా మారిన చంద్రబాబును నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం శత విధాలా ప్రయత్నిస్తోంది. దావోస్ మీటింగుల్లో కచ్చితంగా కనిపించే మొహం చంద్రబాబుదే. అతను అక్కడకు వెళితే చాలా మంది నిట్టూరుస్తారు. తను అంచనా వేసుకున్న పెట్టబడులు లేకుండా చంద్రబాబు తిరిగి వెళ్లరు. అయితే ఇదే విషయం గురించి ఇతర దేశాల వాళ్లు, ఇతర రాష్ట్రాల వారు బాధ పడితే అర్థం ఉంది. కానీ మోడీ పేరుకు ప్రధానిగా ఉన్నా ఆయనకు ఎందుకో ఈ ఎపిసోడ్ అస్సలు నచ్చదు. అందుకోసం ఇప్పటికే అనేక రకాల ప్రయత్నాలు చేసిన మోడీ టీం మరో విఫలయత్నం చేసింది.
జనవరి 22 నుంచి 25 వరకు దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతోంది. ఈసారి 14 మందితో కలసి చంద్రబాబు దావోస్ వెళ్లడానికి ప్లాన్ చేశారు. దీనికి సాధారణ అనుమతి కోసం దరఖాస్తు చేస్తే అనుమతికి ఆలస్యం చేశారు. చివరకు అనేక కొర్రీలు పెట్టడానికి ప్రయత్నించి చివరకు ఎట్టకేలకు అనుమతి ఇచ్చేసింది. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు దావోస్ వెళ్తుంటే బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది అంటూ ఏపీ నేతలు తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబు గత దావోస్ పర్యటనల గురించి తెలిసిన వారంతా బీజేపీనే తప్పు పట్టారు. దీంతో మోడీ వెనక్కు తగ్గక తప్పలేదు. చంద్రబాబు టీం మొత్తానికి అనుమతి ఇస్తూ తాజాగా శుక్రవారం రాత్రి కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.