సినీ నటుడు హరికృష్ణ అంతిమయాత్ర మొదలైంది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతలో స్వగృహం నుంచి హరికృష్ణ పార్థివ దేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ఆయన శరీరాన్ని ఆయనకు ఎంతో ఇష్టమైన పసుపు రంగు పూలతో లంకరించిన వాహనం మీద తరలిస్తున్నారు. ఇంట లోపల నుండి ఆ వాహనం వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తన బావమరిది హరికృష్ణ పాడె మోశారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు సుప్రీంకోర్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పాడె మోశారు.
‘హరికృష్ణ అమర్ రహే’ అనే నినాదాల మధ్య ఆయన అంతిమ యాత్ర కొనసాగుతోంది.దాదాపు పది కిలోమీటర్ల మేర అంతిమయాత్ర సాగి మహాప్రస్థానం చేరుకోగానే ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. మసాబ్ ట్యాంక్, సరోజిని దేవి కంటి ఆసుపత్రి, మెహదీపట్నం, టోలిచౌకీ, షేక్‌పేట్ నాలా, విస్పర్ వ్యాలీ మీదుగా మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర సాగుతుంది. హరికృష్ణ అంతిమ యాత్ర నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే ఆయన అంతిమ యాత్రలో చంద్రబ్బు పాల్గొనడంతో ఆయన అంతిమ యాత్ర మొత్తం Z+ సెక్యురిటీతో సాగుతోంది.