ఇకపై చంద్రబాబు ఏపీ సీఎంగా మాత్రమే కాదు. పలు సంస్థలకు చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.. నెంబర్ 1, ఆయన మానస పుత్రిక P-4, అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్‌నర్‌షిప్ అని అర్థం. సీఎం చంద్రబాబు చైర్ పర్సన్‌గా P-4 సొసైటీ ఏర్పాటయింది. దీనికి వైస్ చైర్ పర్సన్‌గా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉంటారు. నెంబర్ 2, జలహారతి కార్పొరేషన్. దీనికి కూడా చైర్మన్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించనున్నారు. ఇక ఏపీకి రెండు కళ్ల లాంటి పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి…ఈ రెండింటిని పూర్తి చేసే బాధ్యతను కూడా తన భుజస్కంధాల పైనే వేసుకున్నారు చంద్రబాబు.



