వైసీపీ కి కాపు నేతల మూకుమ్మడి గుడ్ బై ?

chandrababu-political-plans-on-kapu-reservation-issue

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కాపు రిజర్వేషన్ వ్యవహారం మీద చంద్రబాబు సర్కార్ ఓ నిర్ణయం తీసుకుంది. అయితే దాని అమలు పూర్తి స్థాయిలో జరగాలంటే ఇంకా కేంద్రం గ్రీన్ సిగ్నల్ రావాలి. అయితే కాపు రిజర్వేషన్ ఉద్యమం జరిగినప్పుడు ఈ అంశం చుట్టూ హడావిడి చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు అసలు అది విషయమే కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. జనసేన అధినేత ఎప్పుడైతే జనంలోకి వచ్చి వైసీపీ మీద విమర్శలు చేశారో అప్పటి నుంచి కాపు ఓట్ల మీద ఆశ వదులుకున్న జగన్ ఆపై బీసీలను దువ్వే పనిలో పడ్డారు. అందుకే పార్టీలోని కాపు నేతలకు ఇక రిజర్వేషన్ అంశం మీద ఎక్కడా మాట్లాడవద్దని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో వైసీపీ లోని కాపు నేతల్లో ఇన్ సెక్యూరిటీ మొదలైంది.

2014 ఎన్నికల్లో ఓటమికి కాపుల ఓట్లు రాజపోవడమే అని జగన్ ఫీల్ అయ్యారు. అందుకే ముద్రగడ ని ముందుకు తెచ్చి ఉద్యమం నడిపించారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఆ ఇద్దరికి ఏమి చేయాలో అర్ధం కాని పరిస్థితి. జగన్ ఇక ఆశలు వదిలేసుకొని ప్రత్యామ్న్యాయం కోసం చూస్తుంటే అభద్రతకు లోను అవుతున్న కాపు నేతలు తమ దారి తాము చూసుకుంటే మేలన్న నిర్ణయానికి వచ్చారంట. ఇదే ఆలోచనతో వైసీపీలో కాపు నేతలు కొందరు ఇటీవల రహస్యంగా సమావేశం అయినట్టు చెబుతున్నారు. వీరిలో ఎక్కువమంది వైసీపీ రాజకీయ భవిష్యత్ , వైసీపీ లో తమ భవిష్యత్ గురించి పెదవి విరిచారట. కాపు రిజర్వేషన్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న చంద్రబాబుని కలిసి మూకుమ్మడిగా టీడీపీ లోకి వెళితే బాగుంటుందని ఓ నాయకుడు చేసిన సూచనకు బాగానే రెస్పాన్స్ వచ్చిందట. వారి వైపు నుంచి ఇప్పటికే టీడీపీ హైకమాండ్ కి సంకేతాలు కూడా వెళ్లాయి. త్వరలో సంప్రదింపులు కొలిక్కి వస్తాయని టాక్. అదే జరిగితే వైసీపీ కి ఇంకో భారీ దెబ్బ తప్పదు.