Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు విద్యుత్ కోసం అష్టకష్టాలు పడ్డారు. నివాసగృహాలకు కరెంటు ఉండే సమయం కన్నా… కోతలే ఎక్కువగా ఉండేవి. వ్యవసాయ విద్యుత్ గురించి చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రం ఎన్నోవిధాలుగా కరెంటు కష్టాలు ఎదుర్కొంది. విద్యుత్ సంస్థలను అప్పుల నుంచి బయట పడేసేందుకు చంద్రబాబు ఆ టైంలో కరెంటు ఛార్జీలు పెంచడం టీడీపీ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపింది. విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం వల్లే టీడీపీపై వ్యతిరేకత పెరిగి… అదే 2004 ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి దారితీసింది. ఇదంతా గత చరిత్ర. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు… కొత్త రాష్ట్రానికి కొత్త వెలుగులను తీసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మారుమూల గ్రామాలు సహా అన్ని ప్రాంతాల్లో 24 గంటలు విద్యుత్ సరఫరా ఉంటోంది. రాష్ట్రంలో కరెంటు కష్టాలన్న మాటే లేదు. వ్యవసాయానికి కూడా అనువైన వేళల్లో విద్యుత్ సరఫరా జరుగుతోంది. అయితే ఈ సరఫరా కు తగ్గట్టుగా ఏపీలో త్వరలో కరెంటు ఛార్జీలు పెంచుతారంటూ కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ వార్తలను ముఖ్యమంత్రి ఖండించారు. విద్యుత్ ఛార్జీలను పెంచే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. అమరావతి సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యయం తగ్గించుకోవడం, తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు జరపడంపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. విద్యుత్ శాఖలో సేవలను అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకోవాలని, వినియోగదారులను వివిధ వర్గాలుగా విభజించి సేవలు అందించాలని సీఎం ఆదేశించారు. ధర్మల్ విద్యుత్ ఉత్పత్తిని, కొనుగోలును క్రమంగా తగ్గించుకుని పునరుత్పాదక విద్యుత్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేలా కార్యాచరణ ఉండాలన్నారు. మొత్తానికి ఛార్జీలు పెరుగుతాయని భయపడుతున్న ప్రజలకు సీఎం గుడ్ న్యూస్ చెప్పారు.
మరిన్ని వార్తలు: