జగన్ పై చంద్రబాబు మరొకసారి సంచలన వ్యాఖ్యలు

జగన్ ఫై చంద్రబాబు మరొకసారి సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై చంద్రబాబు మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. గుంటూరులో మహిళా సంద్రం అంటూ చంద్రబాబు ఒక వీడియో ని పోస్ట్ చేసారు. 5 కోట్ల ప్రజల అభివృద్ధి కోసం జరుగుతున్న మహోద్యమం అని అన్నారు. వారు అడిగే దాంట్లో న్యాయం వుంది అని చంద్రబాబు అన్నారు. అయితే 4 ఏళ్ళు దిగ్విజయంగా నడిచిన రాజధానిని ఏకపక్షంగా తరలించడాన్ని ఎవరైనా సహిస్తారా అని ప్రశ్నించారు.

అయితే నేనే సర్వాధికారిని అనుకుని విర్రవీగిన వాళ్లంతా చరిత్రలో నెలకరిచారు అని అన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన వైసీపీ పఠనం, రాజధాని తరలింపుతో పరాకాష్టకి చేరింది అని అన్నారు. నిర్మాణాన్ని స్వాగతించే జనమే కూల్చివేస్తామంటే ప్రభంజనం అవుతారు అని అన్నారు. ఇంకా వెల్లువెత్తే ప్రజా ఉద్యమాన్ని ఈ కేసులు, నిర్బంధాలు నిరోధించగలవా? అని అన్నారు.