ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు

chandrababu to visits delhi today Over No-Confidence Motion

ఏపీ సీఎం చంద్రబాబుకు ఢిల్లీకి వెళ్లారు. ఉండవల్లిలో తన నివాసం నుంచి నేరుగా బెజవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న బాబు అక్కడి నుంచి ఢిల్లీకి బయల్దేరారు. నేటి పర్యటనలో భాగంగా లోక్‌సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతు తెలిపిన పార్టీలకు బాబు కృతజ్ఞతలు తెలపుతారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంతోపాటు, లోక్‌సభలో జరిగిన చర్చ గురించి ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడతారు. అలాగే భవిష్యత్ కార్యాచరణతో పాటూ ఏపీకి జరిగిన అన్యాయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు. అనంతరం అవిశ్వాసంతో పాటూ పలు కీలక అంశాలపై ఢిల్లీలోనే మీడియాతో మాట్లాడతారని పార్టీ వర్గాలంటున్నాయి. చంద్రబాబు వెంట పలువురు మంత్రులు కూడా ఢిల్లీకి బయలుదేరారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దిశగా ఢిల్లీ వేదికగా మరోసారి గళం విప్పే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.