విదేశాల నుంచి వచ్చేసిన చంద్రబాబు.. హైదరాబాద్ ఎయిర్పోర్టులో ఘనస్వాగతం

Chandrababu, who came from abroad, was welcomed at the Hyderabad airport
Chandrababu, who came from abroad, was welcomed at the Hyderabad airport

ఎన్నికల తర్వాత కాస్త సేదతీరేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశాలకి వెళ్లిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో పది రోజుల పాటు అక్కడ విశ్రాంతి తీసుకున్న చంద్రబాబు తాజాగా స్వదేశానికి తిరిగి చేరుకున్నారు. హైదరాబాద్ కి చేరుకున్న చంద్రబాబుకి పార్టీ నేతలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.

Chandrababu, who came from abroad, was welcomed at the Hyderabad airport
Chandrababu, who came from abroad, was welcomed at the Hyderabad airport

విదేశీ పర్యటనని ముగించుకుని బుధవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి చంద్రబాబు వచ్చారు. పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకి స్వాగతం పలికారు. ఏపీలో ఎన్నికల ప్రచారం, పార్టీ వ్యవహారాలతో చాలా బిజీగా గడిపిన చంద్రబాబు.. విశ్రాంతి కోసం ఈనెల 19వ తేదీన విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే.

మరోవైపు చంద్రబాబు మాత్రమే కాకుండా చాలా మంది నేతలు పోలింగ్ పూర్తైన మరుసటి రోజే విదేశాలకి వెళ్లారు. ఇక కౌటింగ్ సమయం దగ్గర పడుతుడంటంతో వీదేశీ పర్యటనలో ఉన్న నేతలు తిరిగి స్వదేశానికి పయనమయ్యారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి విదేశీ పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయం కి చేరుకున్నారు.